
50 మంది క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు:
ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మూడు విడతల్లో నాడా అధికారులు డోపింగ్ పరీక్షలు చేపట్టనున్నారు. ఆటగాళ్ల నుండి శాంపిల్స్‌ని సేకరించినున్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ క్రికెటర్ల నుండి 50 నమూనాలను సేకరించనున్నారు.

5 కేంద్రాలు ఏర్పాటు:
ఐపీఎల్ 2020 కోసం నాడా ఐదు డోప్ నియంత్రణ కేంద్రాలు (డీసీఎస్) ఏర్పాటు చేయనుంది. మ్యాచ్‌లు జరిగే మూడు వేదికలు దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో మూడు కేంద్రాలు ఉంటాయి. ఇక ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్ క్రికెట్ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఆడేటప్పుడు, సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది.

రక్త నమూనాలు కూడా:
ఐపీఎల్ ఆటగాళ్ల మూత్రమే కాకుండా రక్త నమూనాలూ సేకరించేందుకు నాడా మొగ్గుచూపుతోందని సమాచారం. ఈ మొత్తం డోపింగ్ నిరోధక కార్యకాలాపాలను నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను నాడా నియమించనుంది. నాడా సీనియర్ అధికారి, డీసీవో కేంద్రాల నుంచి ఇద్దరు, యూఏఈ యాంటీడోపింగ్ సభ్యులు ఇద్దరు ఇందులో సభ్యులుగా ఉంటారు. విడతలవారీగా ఈ బృందాలు యూఏఈ చేరుకొని పరీక్షలు చేస్తాయి.

అవగాహన పెంచేందుకే:
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, శ్రేయాస్ అయ్యర్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్ల శాంపిల్స్ సేకరణ.. మిగతా వారిలో అవగాహన పెంచేందుకేనని నాడా అధికారి ఒకరు తెలిపారు. సారథులను చూసి మిగిలిన క్రికెటర్లు కూడా శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.
బర్త్‌డే పార్టీలో రచ్చరచ్చ: బోల్ట్‌కు కరోనా పాజిటివ్.. గేల్‌కు నెగెటివ్!!


Click it and Unblock the Notifications












