న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC World Cup 2019: సిక్స్‌తో ధోని ఫినిష్ చేస్తాడా?

ICC World Cup 2019: MS Dhoni Will Finish It In Style For One Last Time??
ICC World Cup 2019: Will MS Dhoni finish it in style for one last time?

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించడంలో దిట్ట. అందుకే ధోనిని అభిమానులు ముద్దుగా ఫినిషర్ అని పిలుచుకుంటారు.

<strong>పుల్వామా ఉగ్రదాడి: ఇమ్రాన్ ఫోటోలు తొలగింపుపై స్పందించిన పీసీబీ</strong>పుల్వామా ఉగ్రదాడి: ఇమ్రాన్ ఫోటోలు తొలగింపుపై స్పందించిన పీసీబీ

ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని... ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్నాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ భారత్‌కు అందించి.. తన కెరీర్‌కు గట్టి పునాది వేసుకున్న ధోని.. ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్‌ని అందించిన తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి వీడ్కోలు పలకాలని ధోని అభిమానులు ఆశిస్తున్నారు.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా

భారత పర్యటనకు ఆస్ట్రేలియా

క్రికెట్‌లో లవ్, రివెంజ్ చాలా పవర్‌ఫుల్. ఈ రెండింటితో ఎవరైనా ఏదైనా చేయగలరు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ సేన అదేపని చేసి చూపించింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టుని చిత్తుగా ఓడించింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఆరోన్ ఫించ్ సారథ్యంలోని కంగారుల జట్టు టీమిండియా పర్యటనకు రాబోతోంది. గతంలో అనేకసార్లు టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించింది. అయితే, ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం కంగారులకు ఓ పీడకలే.

మూడు హాఫ్ సెంచరీలు చేసిన ధోని

మూడు హాఫ్ సెంచరీలు చేసిన ధోని

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌లో ధోని వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం అందుకున్నాడు. ముఖ్యంగా చివరి వన్డేలో 87 పరుగులతో ధోని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి మునుపటి మహీని గుర్తుకు తెచ్చాడు. గత కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్నధోని తనలోని ఫినిషర్‌ను ఈ సిరిస్‌లో తట్టిలేపాడు. 2018లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 25 యావరేజితో కేవలం 275 పరుగులు మాత్రమే చేసిన ధోని వరల్డ్‌కప్‌కి ముందు ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఆనందానికి గురి చేసింది.

ఈ ఏడాది 242 పరుగులు చేసిన ధోని

ఈ ఏడాది 242 పరుగులు చేసిన ధోని

ఈ ఏడాది ఆడిన 6 మ్యాచ్‌ల్లో ధోని ఇప్పటికే 242 పరుగులు చేశాడు. యావరేజి 121 కావడం విశేషం. దీంతో వరల్డ్‌కప్ జట్టులో ధోని కీలకంగా మారాడు. వరల్డ్ కప్ కోసం జట్టుని ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ధోనీని సెలెక్టర్లు ఎంపిక చేస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్నందున జట్టులో ధోని చాలా కీలకం కానున్నాడు.

వరల్డ్‌కప్‌లో కీలక ఆటగాడు

వరల్డ్‌కప్‌లో కీలక ఆటగాడు

అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తోన్న ధోని మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఫీల్డర్ల మోహరింపులో బౌలర్లకు, కోహ్లీకి బాసటగా నిలవగలడు. మైదానంలో సైలెంట్‌గా ఉంటూ వ్యూహాలు పన్నడంలో ధోని దిట్ట. ఇక, ధోని డీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి నైపుణ్యాలతోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన ధోనీ ఈ వరల్డ్‌కప్‌లోనూ అత్యంత కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.

Story first published: Monday, February 18, 2019, 16:00 [IST]
Other articles published on Feb 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X