న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో మయాంక్ అగర్వాల్ ఎంపిక వెనుక రాహుల్ ద్రవిడ్!

ICC World Cup 2019: What promoted Mayank Agarwal’s selection over Ambati Rayudu?

హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్ బైగా ప్రకటించిన రిషబ్ పంత్‌ను బీసీసీఐ ఇంగ్లాండ్‌కు పంపించింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో రాయుడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విజయ్‌ శంకర్‌ నిష్క్రమణ నేపథ్యంలో అంబటి రాయుడికి అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే, అంబటి రాయుడుని కాదని విజయ్ శంకర్ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. వాస్తవానికి స్టాండ్‌బై‌గా ఉన్న అంబటి రాయుడికి ఆ అవకాశం దక్కాలి. కానీ, తర్జనభర్జనల తర్వాత మయాంక్ అగర్వాల్‌ని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

నిజానికి మ‌యాంక్ అగ‌ర్వాల్ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడాడే గానీ.. భారత్ తరుపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం క‌ర్ణాట‌క జ‌ట్టు త‌ర‌ఫున రంజీల్లో ఆడుతున్నాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో 50 ఓవ‌ర్ల మ్యాచ్‌ల‌ను ఆడిన అనుభ‌వం కూడా త‌క్కువే. అయిన‌ప్పటికీ అతడిపై విశ్వాసం ఉంచింది జట్టు మేనేజ్‌మెంట్‌.

స్టాండ్ బైగా కూడా అత‌ని పేరు లేన‌ప్ప‌టికీ

స్టాండ్ బైగా కూడా అత‌ని పేరు లేన‌ప్ప‌టికీ

కేవలం టీ20ల్లో ఆడిన అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. స్టాండ్ బైగా కూడా అత‌ని పేరు లేన‌ప్ప‌టికీ.. మ‌యాంక్‌ను ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఎంపిక చేయడం వెనుక టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన

గతేడాది ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన

28 ఏళ్ల మయాంక్ అగర్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై గతేడాది ఇండియా-ఏ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 71.75 సగటుతో 287 పరుగులు చేయడంతో పాటు ఈ సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ సిరీస్‌లో మయాంక్ స్ట్రైక్‌రేట్‌ 105.90గా ఉండటంతో.. సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

రాయుడి పేలవ ఫామ్‌ కూడా ఓ కారణం

రాయుడి పేలవ ఫామ్‌ కూడా ఓ కారణం

మరోవైపు ఇటీవలి కాలంలో అంబటి రాయుడి పేలవ ఫామ్‌పై కూడా సెలక్టర్లు చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టెస్టుల్లో ప్రొఫెషనల్ ఓపెనర్‌‌ అయిన మయాంక్‌ని తుది జట్టులో ఆడిస్తే అప్పుడు కేఎల్ రాహుల్‌ని నాలుగో స్థానంలో మార్చుకునే వెసులబాటుని కూడా దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

రాహుల్ ద్రవిడ్ మాట సాయం

రాహుల్ ద్రవిడ్ మాట సాయం

ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం మయాంక్ అగర్వాల్ గురించి చెప్పిన మంచి మాటలు సైతం అతడిని ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకునేలా చేశాయని బీసీసీఐ వర్గాల సమాచారం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో అంబటి రాయుడు పేలవ ఫామ్ కూడా అతడి ప్రపంచకప్ అవకాశాలను దూరం చేసినట్లు తెలిపారు.

భారత్ తరుపున రెండు టెస్టులు

భారత్ తరుపున రెండు టెస్టులు

ఆస్ట్రేలియాతో సిరీస్ సంద‌ర్భంగా గ‌తేడాది మ‌యాంక్ అగ‌ర్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రెండు టెస్టుల్లో మొత్తం మూడు ఇన్నింగులు ఆడిన మ‌యాంక్ అగ‌ర్వాల్ 195 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 77. ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు 50, లిస్ట్ ఎ మ్యాచ్‌లు 75 ఆడాడు.

Story first published: Wednesday, July 3, 2019, 16:17 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X