న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: మ్యాచ్‌ని గెలిపించలేకపోయిన ఒక ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు

ICC Crickt World Cup 2019 : Root, Buttler Centuries Go In Vain Vs Pak, 5 Such Instances From Past
ICC World Cup 2019: Root, Buttler centuries go in vain vs Pakistan: 5 such instances from past

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ రూట్‌ 104 బంతుల్లో 107(10 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్‌ 76 బంతుల్లో 103 (9 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో మెరిసినప్పటికీ ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించలేకపోయారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం 349 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షాదాబ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ జాసన్‌ రాయ్‌ (8)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (32), జో రూట్‌ నిలకడగా ఆడటంతో ఇంగ్లాండ్‌ 8.5 ఓవర్లకు వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించి మూడు వికెట్లు పడగొట్టారు. బెయిర్‌స్టోను వాహబ్‌ రియాజ్‌, మోర్గాన్‌ (9)ను హఫీజ్‌, స్టోక్స్‌ (13)ను మాలిక్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 118/4తో కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి జోస్ బట్లర్‌తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సెంచరీలు సాధించి ఇంగ్లాండ్‌ను పోటీలోకి తెచ్చారు. అయితే, చివర్లో పాక్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిని పెంచడంలో విజయవంతమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.

జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సెంచరీలు బాదినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవ్వడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా జరగడంలో వరల్డ్‌కప్‌లో ఇదే తొలిసారి. 1975లో ఈ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే జట్టులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు సెంచరీ చేసిన సందర్భాలు 15.

అత్యధికంగా 2015 వరల్డ్‌కప్‌లో ఒకే జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఆరు సార్లు సెంచరీలు నమోదు చేశారు. ఒక్క సోమవారం ఇంగ్లాండ్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని తప్పించి... అన్ని సార్లు సెంచరీలు నమోదు చేసిన జట్లే విజయాన్ని సాధించాయి. భారత జట్టులోని ఆటగాళ్లు ఇలా నాలుగు సార్లు సెంచరీలను సాధించారు.

1999 వరల్డ్‌కప్‌లో రెండు సార్లు సెంచరీలను నమోదు చేయగా... 2003, 2011 వరల్డ్‌కప్‌లో సెంచరీలను సాధించారు. వరల్డ్‌కప్ టోర్నీలో కాకుండా ఒక మ్యాచ్‌లో, ఒక ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు సాధించినప్పటికీ ఓడిపోయిన సందర్భాలు ఒక్కసారి చూద్దాం...

2018: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం

2018: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం

ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచిన టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ ఆరోన్ ఫించ్(100), షాన్ మార్ష్(101) సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. అనంతరం చేధనలో ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయ్(101) సెంచరీతో చెలరేగడంతో 5 ఓవర్లు మిగిలుండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది.

2018: ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం

2018: ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం

టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జానీ బెయిర్ స్టో(138), జో రూట్(102) సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేసింది. అనంతరం చేధనలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్(181) సెంచరీ రాణించడంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2016: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం

2016: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(117), స్టీవ్ స్మిత్(108) పరుగులతో రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. అనంతరం చేధనలో డేవిడ్ మిల్లర్(118 నాటౌట్) రాణించడంతో 4 వికెట్ల తేడాతో విజయం విజయం సాధించింది.

2016: ఇండియాపై ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో విజయం

2016: ఇండియాపై ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో విజయం

టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ ఆరోన్ పించ్(107) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో భారత జట్టులో శిఖర్ ధావన్(123), విరాట్ కోహ్లీ(106) సెంచరీలతో రాణించినప్పటికీ 25 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

2012: పాకిస్థాన్‌పై ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం

2012: పాకిస్థాన్‌పై ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం

మిస్బా ఉల్ హాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఓపెనర్లు మహ్మద్ హఫీజ్(105), నసిర్ జమ్సెడ్(112) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 329 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో విరాట్ కోహ్లీ (183) సెంచరీతో రాణించడంతో మరో రెండో ఓవర్లు మిగిలుండగానే భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Tuesday, June 4, 2019, 12:45 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X