న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే వరల్డ్‌కప్: ధోనికి బ్యాకప్ కీపర్ అవసరం లేదన్న భజ్జీ

ICC Cricket World Cup 2019 : Harbhajan Singh Feels That Dhoni Doesn’t Need Any Backup Keeper
ICC World Cup 2019: MS Dhoni doesn’t need any backup, reckons Harbhajan Singh

హైదరాబాద్: ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టుని బీసీసీఐ సోమవారం ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ధోనికి బ్యాకప్ కీపర్‌గా రిషబ్ పంత్ లేదా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయాలని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అనుభవం దృష్ట్యా పంత్‌తో పోలిస్తే దినేశ్ కార్తీక్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే, వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోయే భారత జట్టులో ధోనికి ప్రత్యామ్నాయంగా మరో వికెట్‌ కీపర్‌ అవసరం లేదని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోనికి బ్యాకప్‌ కీపర్‌ను తీసుకోవడం వల్ల

ధోనికి బ్యాకప్‌ కీపర్‌ను తీసుకోవడం వల్ల

ఈ మెగా టోర్నీలో ధోనికి బ్యాకప్‌ కీపర్‌ను తీసుకోవడం వల్ల ఒక స్థానం వృథా చేసినట్లే అని హర్భజన్ తెలిపాడు. గాయం కారణంగా ఏదైనా మ్యాచ్‌కి ధోని దూరమైతే అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను ఆడించటం మంచిదని భజ్జీ తెలిపాడు. రిషభ్‌ పంత్‌ లేదా దినేశ్‌ కార్తీక్‌... ధోనికి బ్యాకప్ కీపర్లుగా తీసుకోవడం వల్ల ఒక స్థానం వృధా చేసినట్లు అవుతుందని అన్నాడు.

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో

తాజాగా సోమవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "ధోనితో కలిసి క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి అతడికి వెన్నునొప్పి ఒక సమస్యగా ఉందన్న విషయం తెలుసు. అయితే, ఆ సమస్య ఉన్నప్పటికీ ధోని దానిని అధిగమిస్తాడనే నమ్మకం నాకుంది. ధోనికి బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం లేదు. వరల్డ్‌కప్‌లో ఏదైనా మేజర్ గాయం అయితే తప్ప. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్‌ సేవలను వినియోగించుకోవచ్చు" అని అన్నాడు.

విజయ్‌‌ను నాలుగో స్థానంలో తీసుకోవాలన్న

విజయ్‌‌ను నాలుగో స్థానంలో తీసుకోవాలన్న

"విజయ్‌‌ను నాలుగో స్థానంలో తీసుకోవాలన్న ఆలోచనను సైతం ఇది దెబ్బతీస్తుంది. మరోవైపు అంబాటి రాయుడిని కూడా ఈ స్థానంలో తీసుకోవచ్చు. అయితే, ఇటీవలి కాలంలో రాయుడు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే కేఎల్ రాహుల్‌కు జట్టులో స్థానం కల్పిస్తే బాగుంటుంది. వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉన్నా... బ్యాటింగ్‌లో రాహుల్‌ సేవలను వినియోగించుకోవచ్చు" అని భజ్జీ అన్నాడు.

నవదీప్ షైనీని నాలుగో సీమర్‌గా

నవదీప్ షైనీని నాలుగో సీమర్‌గా

అన్ని ఫార్మాట్లలో గత కొంతకాలంగా అధ్భుత ప్రదర్శన చేస్తోన్న నవదీప్ షైనీని నాలుగో సీమర్‌గా తీసుకోవాలని భజ్జీ సూచించాడు. "ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని కాదు... గతంలో అతడు అనేక రంజీ మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్నాడు" అని అన్నాడు. నవదీప్ షైనీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో వికెట్లు తీయకున్నా... తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

Story first published: Monday, April 15, 2019, 14:46 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X