న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: దక్షిణాఫ్రికా vs ఇండియా మ్యాచ్‌లో బద్దలయ్యే రికార్డులివే!

ICC Cricket World Cup 2019 : India V South Africa, Statistical Preview ! || Oneindia Telugu
ICC World Cup 2019: Match 8, South Africa vs India – Match Preview

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్‌కప్ మెగా టోర్నీలో టీమిండియా క్యాంపెయిన్ 7వ రోజున ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా బుధవారం కోహ్లీసేన తన ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సఫారీలు ఇప్పటికే టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 104 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత గత ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సఫారీలు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు.

మరోవైపు టోర్నీకి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన ఒకదాంట్లో ఓడగా... రెండో మ్యాచ్‌లో విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో గత వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఇరు జట్ల మధ్య నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

130 పరుగుల తేడాతో విజయం

130 పరుగుల తేడాతో విజయం

1 - 2015 వరల్డ్‌కప్‌లో సఫారీలపై టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు దక్షిణాఫ్రికానే విజయం సాధించింది.

3 - కోహ్లీసేన చివరగా వన్డేల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. 2007 వరల్డ్‌కప్‌కు ముందు కూడా సరిగ్గా ఇలానే టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2015-16 సీజన్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరిస్‌లో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది.

దక్షిణాఫ్రికాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం

దక్షిణాఫ్రికాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం

5 - ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో దక్షిణాఫ్రికాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. వరల్డ్ టీ20(2012, 2014), ఛాంపియన్స్ ట్రోఫీ(2013, 2017), వన్డే వరల్డ్‌కప్ 2015లో సఫారీలపై టీమిండియా విజయం సాధించింది.

28 - వన్డేల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజి 35 కంటే తక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే. సఫారీలపై 23 వన్డే ఇన్నింగ్స్‌‌ల్లో రోహిత్ శర్మ 644 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అద్భుతమైన ఫామ్‌లో డీకాక్

అద్భుతమైన ఫామ్‌లో డీకాక్

64.5 - టీమిండియాపై సఫారీ ఓపెనర్ క్వింటన్ డీకాక్ యావరేజి. భారత్‌పై 12 వన్డేలాడిన క్వింటన్ డీకాక్ 774 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.

66.78 - దక్షిణాఫ్రికా జట్టుపై విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజి. సఫారీలపై 24 వన్డే ఇన్నింగ్స్‌లాడిన విరాట్ కోహ్లీ 1269 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2960 - డేవిడ్ మిల్లర్ మరో 40 పరుగులు చేస్తే వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

ఆమ్లా మరో 77 పరుగులు చేస్తే!

ఆమ్లా మరో 77 పరుగులు చేస్తే!

7923 - వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఇప్పటివరకు చేసిన పరుగులు. తను ఆడబోయే మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 77 పరుగులు గనుక చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు డీకాక్ మరో 22 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 8వేల పరుగులను అందుకుంటాడు.

8980 - ఓపెనర్‌గా శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన పరుగులు. మరో 20 పరుగులు గనుక చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 9వేల పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు రోహిత్ శర్మ(7974) మరో 26 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 8వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

Story first published: Tuesday, June 4, 2019, 16:06 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X