న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా సూపర్ క్యాచ్: సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం (వీడియో)

ICC Cricket World Cup 2019 : Ravindra Jadeja Takes A Stunning Catch To Dismiss Jason Roy || Oneindia
Jadeja

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా కేఎల్ రాహుల్ గాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా రవీంద్ర జడేజా అడుగుపెట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు జడేజా క్యాచ్ పట్టడంతో 160 పరుగుల భారీ భాగస్వామ్యానికి కుల్దీప్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కుల్దీప్‌ వేసిన 23వ ఓవర్‌లో రాయ్‌ లాంగ్ ఆన్‌ మీదుగా భారీ షాట్ కొట్టాడు.

1
43681

అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తోన్న రవీంద్ర జడేజా పరిగెత్తుకుంటా వచ్చి అమాంతం బంతిని అందుకోవడంతో 160 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

"జట్టు నుంచి నువ్వు దూరమైన మ్యాచ్‌ నుంచి నిన్ను ఎవరూ దూరం చేయలేరు" అని ఓ నెటిటన్ కామెంట్ చేయగా... "జడేజా క్యాచ్ చూసిన తర్వాత అందరూ అతన్ని జట్టులో ఎందుకు తీసుకోలేదని తప్పకుండా ప్రశ్నిస్తారు" అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

అంతకముందు జానీ బెయిర్‌ స్టో(111; 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించగా బెన్‌ స్టోక్స్‌(79‌; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌(66;57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. జో రూట్‌(44; 54 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించింది.

భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటాడు. ఇంగ్లండ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో షమీ కీలక వికెట్లు సాధించాడు. బుమ్రా, కుల్దీప్‌లు తలో వికెట్‌ తీశారు.

{headtohead_cricket_2_3}

Story first published: Sunday, June 30, 2019, 20:58 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X