న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే! టాప్-4 టీమ్స్ సెమీస్‌కు అలానే చేరాయా?

 ICC World Cup 2019: Bat first and win tournament: Thats what top 4 teams are convinced about now

హైదరాబాద్: ప్రపంచకప్ మొదలు కావడానికి ముందు క్రికెట్ విశ్లేషకులు ఇంగ్లాండ్ పిచ్‌లపై పరుగుల వరద పారుతుందని అంచనా వేశారు. అందుకు తగ్గట్లే ఇంగ్లీషు పిచ్‌లను రూపొందించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రపంచకప్ మొదలైన తర్వాత అంచనాలు తారుమయ్యాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్పించి అన్ని మ్యాచ్‌ల్లోనూ పరుగుల వరద పారలేదు. అయినప్పటికీ పలువురు బ్యాట్స్‌మెన్లు మాత్రం మెరుపులు మెరిపించారు. ప్రత్యర్ధి జట్టు నిర్దేశించిన లక్ష్యాలను చేధనలో అలవోకగా అందుకోవడానికి కారణం టీ20 క్రికెట్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో పాటు ఈ ప్రపంచకప్‌లో టాస్ కూడా కీలకపాత్ర పోషించిందని అంటున్నారు. ఈ ప్రపంచకప్‌లో బుధవారంతో మొత్తం 41 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లోకి దూసుకెళ్లాయి. ఆయా జట్లు సెమీస్‌కు దూసుకెళ్లడంలో టాస్ కూడా కీలకంగా వ్యవహారించింది.

సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా

సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా

ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. టోర్నీలో భాగంగా గత 10 మ్యాచ్‌లను ఒక్కసారి పరిశీలిస్తే 7 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జట్లే విజయం సాధించాయి. లార్డ్స్ వేదికగా జూన్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ మాత్రం ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇంగ్లాండ్ ఓడిపోవడంతో

ఇంగ్లాండ్ ఓడిపోవడంతో

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో పాటు సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఇండియా, న్యూజిలాండ్ జట్లతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. దీంతో ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మళ్లీ సెమీస్ రేసులోకి వచ్చింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝళిపించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్లు నమోదు చేయడంతో పాటు విజయం సాధించింది. ఇక, ఇంగ్లాండ్ బౌలర్లు సైతం ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా విజయాల్లో టాస్ కీలకంగా మారింది. ఆస్ట్రేలియా గెలిచిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసినవే కావడం. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియా సెకండ్ బ్యాటింగ్ చేసి విజయం సాధించింది.

కోహ్లీసేన గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లో

కోహ్లీసేన గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లో

టీమిండియా విషయానికి వస్తే కోహ్లీసేన గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క దక్షిణాఫ్రికాపై మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లలో ఓటమి పాలైన జట్లుగా ఆస్ట్రేలియా, ఇండియా నిలిచాయి. ఈ రెండు జట్లకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ ఓటమి పాలవడం విశేషం.

Story first published: Thursday, July 4, 2019, 13:54 [IST]
Other articles published on Jul 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X