న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Women's World Cup 2022: కొత్త గైడ్‌లైన్స్.. 9 మందితో మ్యాచ్ ఆడవచ్చు!

 ICC Womens World Cup 2022 to go ahead with 9 players a side in case of Covid outbreak

దుబాయ్: న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భావిస్తోంది. ఈ క్రమంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టోర్నీలో పాల్గొనే టీమ్స్‌పై కరోనా ప్రభావం పడితే చెరో తొమ్మిది మందితో అయినా మ్యాచ్‌లు కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ నైన్ ఏ సైడ్ గేమ్ రూల్‌ను ప్రవేశపెట్టిన ఐసీసీ.. మహిళల ప్రపంచకప్‌లో కొనసాగించాలనుకుంటుంది.

 9 మందితో మ్యాచ్‌లు..

9 మందితో మ్యాచ్‌లు..

ఏ టీమ్‌లో అయినా ప్లేయర్లు కరోనా బారిన పడితే తొమ్మిది మందితోనే మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లే తెలిపారు. మ్యాచ్ టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు అందుబాటులో లేకుంటే ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్‌లోని మహిళా మెంబర్స్ సబ్‌స్టిట్యూట్స్‌గా వచ్చే అవకాశం ఇస్తామన్నారు. నాన్ బ్యాటింగ్, నాన్ బౌలింగ్ సబ్‌స్టిట్యూట్స్‌గా ఇద్దరిని అనమతించి మ్యాచ్ జరిగేలా చూస్తామని చెప్పారు. అవసరం అయితే మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో అన్ని దేశాలకు 15 మందితో కూడిన మెయిన్ టీమ్‌తో పాటు అదనంగా ముగ్గురు రిజర్వ్ ప్లేయర్ల‌కు అనుమతి ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ అయితే రిజర్వ్ ప్లేయర్లను ప్రధాన టీమ్‌లోకి తీసుకోవచ్చు.

పాకిస్థాన్‌తో షురూ..

పాకిస్థాన్‌తో షురూ..

అలాగే ప్లేయ‌ర్స్‌ను బ‌యో బ‌బుల్స్‌లో ఉంచ‌డం, బంతి బౌండరీ లైన్‌ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయ‌డం, ఓ ప్లేయ‌ర్ క‌రోనా బారిన ప‌డితే జ‌ట్టులో ప్ర‌తి ప్లేయ‌ర్‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వంటి నిబంధనలను య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌ని ఐసీసీ ప్ర‌క‌టించింది. బే ఓవల్ వేదిక‌గా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా.. చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు త‌ల‌ప‌డ‌నుంది.

 భారత ప్రపంచకప్ జట్టు:

భారత ప్రపంచకప్ జట్టు:

మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్

Story first published: Friday, February 25, 2022, 9:41 [IST]
Other articles published on Feb 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X