న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్-19 ప్రపంచకప్ : సౌతాఫ్రికాకు అఫ్గాన్ షాక్

ICC U 19 World Cup South Africa vs Afghanistan: Ghafari stars as Afghans thump hosts

కింబర్లీ: అండర్-19 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు అదిరే ఆరంభాన్ని అందుకుంది. సౌతాఫ్రికా వేదికగా శుక్రవారం ఘనంగా ప్రారంభమైన ఈ టోర్నీలో అఫ్గాన్ 7 వికెట్లతో గెలుపొంది శుభారంభం చేసింది. మెగా టోర్నీ తొలి రోజు, తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య సాఫారీ జట్టుకు చుక్కలు చూపించింది.

గఫారీ సిక్సర్..

గఫారీ సిక్సర్..

అఫ్గాన్ స్పిన్నర్‌ షఫీక్‌ఉల్లా గఫారీ (6/15) మాయాజాలానికి సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది. గ్రూప్‌ ‘డి'లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. గఫారీ ధాటికి 29.1 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 62/2తో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సౌతాఫ్రికా జట్టును గఫారీ తన లెగ్‌ బ్రేక్‌తో తిప్పేశాడు.

రోహిత్, ధావన్‌కు గాయం.. మూడో వన్డేకు డౌట్!

దాంతో దక్షిణాఫ్రికా చివరి 8 వికెట్లను 67 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అనంతరం అఫ్గాన్‌ 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి ఏడు వికెట్లతో గెలుపొందింది. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (52; 8 ఫోర్లు), ఇమ్రాన్‌ (57; 9 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌' అవార్డును గఫారీ అందుకున్నాడు.

శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్

శ్రీలంకతో భారత్ తొలి మ్యాచ్

ఈ మెగా టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న భారత యువ జట్టు 5వసారి ట్రోఫీపై కన్నేసింది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్న ఇండియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఈసారి భారత జట్టుకు ప్రియం గార్గ్‌ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

తేదీ: జనవరి 19 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs శ్రీలంక, 7వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: జనవరి 21 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs జపాన్, 11వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: జనవరి 24 (మధ్యాహ్నం 1.30 IST)

మ్యాచ్: ఇండియా Vs న్యూజిలాండ్, 20 వ మ్యాచ్, గ్రూప్ ఎ

వేదిక: మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్

తేదీ: ఫిబ్రవరి 03, 2020

మ్యాచ్: ఫైనల్

వేదిక: సేన్వెస్ పార్క్, పోట్చెఫ్‌స్ట్రూమ్

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు:

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు:

ప్రియామ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యన్ష్ సక్సేనా, ధ్రువ్ చంద్ జురెల్ (వైస్ కెప్టెన్), శశ్వత్ రావత్, సిద్ధేష్ వీర్, శుభంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అధర్వ సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్

Story first published: Saturday, January 18, 2020, 10:32 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X