రోహిత్, ధావన్‌కు గాయం.. మూడో వన్డేకు డౌట్!

రాజ్‌కోట్: తొలి వన్డే ఓటమి బాధించిందో లేక ప్రతీకారం తీసుకోవాలన్న కసి పెరిగిందేమో గానీ.. కోహ్లీసేన ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్(96, కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) రాణించగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో సునాయసంగా గెలుపొందింది. ఓవైపు భారీ విజయంతో సంతోషంగా ఉన్న భారత అభిమానులకు ఆటగాళ్లను వరుసగా వెంటాడుతున్నగాయాలు కలవరపెడుతున్నాయి. తొలి వన్డేలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడి కంకషన్ తీసుకోగా.. తాజా మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, ధావన్ గాయాలకు గురయ్యారు. దీంతో బెంగళూరు వేదికగా జరిగే డిసైడర్ వన్డేలో ఈ ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఫీల్డింగ్ చేస్తూ..
ఆసీస్ ఇన్నింగ్స్ 43వ ఓవర్లో డీప్ పాయింట్‌లో బౌండరీని ఆపే క్రమంలో రోహిత్ నియంత్రణ కోల్పోయాడు. అతనిఎడమ భుజానికి గాయమైంది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న అతనికి టీమ్ ఫిజియో నితిన్ పటేల్ చికిత్స అందించాడు. అనంతరం రోహిత్ మైదానం వీడాడు. అతని స్థానంలో కేదార్ జాదవ్ ఫీల్డింగ్ చేశాడు. అయితే రోహిత్‌కు కొంత నొప్పి ఉన్నా ఎలాంటి చీలిక, పగులు మాత్రం రాలేదు కాబట్టి తర్వాతి మ్యాచ్‌కు అందు బాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు కోహ్లి వెల్లడించాడు.

కమిన్స్ బంతితో కొట్టడంతో..
భారత బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతను ఫీల్డింగ్ చేయలేదు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో కమిన్స్ విసిరిన బంతి నేరుగా అతని కుడి వైపు పక్కటెముకల్లో బలంగా తాకింది. ఆ బంతికి సింగిల్ పూర్తి చేసుకున్న ధావన్ చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే బెదరకుండా క్రీజ్‌లోనే నిలిచి ఆటను కొనసాగించిన అతను తన స్కోరుకు మరో 69 పరుగులు జోడించడం విశేషం. ధావన్‌కు బదులుగా చహల్ ఫీల్డింగ్ చేశాడు. ఇక వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో కూడా ఇదే ఆసీస్‌తో గాయపడ్డా బ్యాటింగ్ కొనసాగించిన గబ్బర్ సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత అతని చేతి వేలు విరిగిందని తేలడంతో మెగాటోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ధావన్ ఒకే.. కానీ రోహితే..
ధావన్ గాయం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అతను పూర్తిగా కోలుకున్నాడని టీమ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే రోహిత్ గాయం గురించే స్పష్టత లేదని, ప్రస్తుతం అతనికి ఫిజియో టీమ్ చికిత్స అందిస్తున్నారు. అయితే భవిష్యత్తు టోర్నీలు.. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో మూడో వన్డేలకు రోహిత్‌ను పక్కనేపెట్టే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications