న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్: మళ్లీ మొదటి స్థానంలో స్మిత్, కోహ్లీ నో చేంజ్

 ICC Test Rankings: Steve Smith, Kagiso Rabada retain top spots

హైదరాబాద్: దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ అనంతరం ఐసీసీ మళ్లీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ట్యాంపరింగ్‌కు పాల్పడి జట్టు నుంచి వైదొలగిన స్టీవ్ స్మిత్‌ యథావిధిగా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 1పొజిషనల్‌లో స్టీవ్ స్మిత్ ఉండగా రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. వీరి స్థానాలు పదిలంగానే ఉండగా మిగిలిన వారికి స్థానభ్రంశం తప్పలేదు. కేన్ విలియమ్సన్ మూడు నుంచి 4వ స్థానంలోకి జో రూట్ నాలుగో స్థానం నుంచి 3వ స్థానంలోకి మారిపోయారు.

అంతకుముందు కంటే మెరుగైన తొమ్మిదో స్థానంలోకి మార్కరమ్ చేరుకున్నాడు. ట్యాంపరింగ్ వివాదంతో జట్టు నుంచి నిషేదానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానాన్ని కోల్పోలేదు. చెప్పుకోదగ్గ ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్థానాల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా.. తక్కిన ఆటగాళ్లు భారీ స్థాయిలోనే మెరుగైన స్థానంలో ఉన్నారు. అజహర్ అలీ, హషీమ్ ఆమ్లాలు టాప్ 10లోకి దూసుకొచ్చారు.

ఇక బౌలర్ల విషయానికొస్తే.. వెర్నన్ ఫిలాండర్ ఈ టెస్టు సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతో అతనికి టాప్ 3 స్థానం దక్కింది. అతని కంటే ముందు జేమ్స్ అండర్‌సన్, కగిసో రబాడ ఉన్నారు. రబాడ 897 పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనే టాప్ స్థానాన్ని గెలుచుకున్నాడు. మిగిలిన స్థానాల్లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 4,5 స్థానాల్లో నిలిచారు.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో వెర్నాన్ ఫిలాండర్, రవిచంద్రన్ అశ్విన్‌లు నాలుగో స్థానంలో నిలిచారు.

ఐసీసీ విడుదల చేసిన ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఇలా:

బ్యాటింగ్‌లో:

#1 Steven Smith

#2 Virat Kohli

#3 Joe Root

#4 Kane Williamson

#5 David Warner

#6 AB de Villiers

#7 Cheteshwar Pujara

#8 Dean Elgar

#9 Aiden Markram

#10 Azhar Ali

బౌలర్లలో:

#1 Kagiso Rabada

#2 James Anderson

#3 Vernon Philander

#4 Ravindra Jadeja

#5 Ravichandran Ashwin

#6 Pat Cummins

#7 Morne Morkel

#8 Trent Boult

#9 Rangana Herath

#10 Neil Wagner

ఆల్ రౌండర్స్ వీరే:

#1 Shakib Al Hasan

#2 Ravindra Jadeja

#3 Vernon Philander

#4 Ravichandran Ashwin

#5 Ben Stokes

Story first published: Wednesday, April 4, 2018, 15:55 [IST]
Other articles published on Apr 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X