2017 సంవత్సరానికి గాను ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ మూమెంట్‌ ఇదే (వీడియో)

Posted By:
ICC shares ‘Spirit of Cricket’ moment of the year

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2017 సంవత్సరానికి గాను 'స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌' మూమెంట్‌ అంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఈ ఏడాది 'స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌' మూమెంట్‌‌గా ఐసీసీ ఎంపిక చేసిన ఏ మ్యాచ్‌కి సంబంధించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫికి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఫైనల్లో భాగంగా భారత్ తన దాయాది దేశమైన పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ సన్నివేశం ఈ ఏడాది 'స్పిరిట్‌ ఆఫ్‌ మూమెంట్‌'గా నిలిచింది.

2017 జూన్‌ 18న ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా భారత్-పాక్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు హాజరయ్యారు.

ఈ సమయంలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌.. పాక్ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌, బౌలింగ్‌ కోచ్‌ అజార్‌ మహమూద్‌ కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయినప్పటికీ... ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో మెలిగారంటూ ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు అదే వీడియో 2017 సంవత్సరానికి గాను 'స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌' మూమెంట్‌‌కు వేదికైంది. దీనికి సంబంధించిన వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, December 7, 2017, 18:33 [IST]
Other articles published on Dec 7, 2017
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి