న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’పై రచ్చ: ఆ చిహ్నాన్ని తొలగించాల్సిందేనన్న ఐసీసీ

ICC Cricket World Cup 2019 : MS Dhoni Can't Sport Army Insignia On Gloves As ICC Denies BCCI Request
ICC denies MS Dhoni permission to sport Balidaan Badge on his gloves in World Cup 2019

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన గ్లోవ్స్‌ మీద ఉన్న 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోని తొలగించాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. అది సైన్యానికి సంబంధించిన గుర్తు కాదని బీసీసీఐ లేఖ రాసినప్పటికీ ఐసీసీ సంతృప్తి చెందలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్రికెటర్లు ఉపయోగించే దుస్తులు, పరికరాలపై స్పాన్సర్ల లోగోలు మినహాయిస్తే.. రాజకీయ, మత, వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడ్డ చిహ్నాలు ఉండకూడదన్నది ఐసీసీ నిబంధన. అయితే ప్యారాచూట్‌ సైనిక దళ విభాగంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని 'బలిదాన్‌ బ్యాడ్జ్‌'ను గ్లోవ్స్‌ మీద ముద్రించుకుని వరల్డ్‌కప్‌లో ఆడటంతో ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

బీసీసీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన ఐసీసీ

బీసీసీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన ఐసీసీ

దీనిని వెంటనే తొలగించాలని పేర్కొంది. మరోవైపు ధోని ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'ను గ్లోవ్స్‌ మీద ముద్రించడం వెనుక ఎలాంటి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు లేవని బీసీసీఐ వివరణ ఇచ్చింది. దేశభక్తిని చాటేందుకే ధోని అలా చేశాడు కాబట్టి బలిదాన్‌ బ్యాడ్జ్‌ ఉన్న గ్లోవ్స్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగనివ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరింది.

ఐసీసీకి లేఖ రాసిన వినోద్ రాయ్

ఐసీసీకి లేఖ రాసిన వినోద్ రాయ్

ఈ మేరకు బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ ఐసీసీకి లేఖ రాశారు. అందులో ధోని ధరించిన గ్లౌవ్స్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ "ధోని ధరించిన గ్లోవ్స్‌పై ఉన్న లోగో మిలటరీ సింబల్‌ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఐసీసీ అనుమతి కోరాం" అని తెలిపారు.

బీసీసీఐ విజ్ఞప్తికి బదులిచ్చాం

అయితే, బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. "బీసీసీఐ విజ్ఞప్తికి బదులిచ్చాం. వరల్డ్‌కప్‌లో ధోని ఆ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌ను ధరించడానికి అనుమతించం. అలా ధరించడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు" అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ధోనికి మద్దతుగా నిలుస్తున్న అభిమానులు

ధోనికి మద్దతుగా నిలుస్తున్న అభిమానులు

ఇదిలా ఉంటే, ఈ విషయంలో #DhoniKeepTheGlove అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ భారత అభిమానులు ధోనీకి మద్దతు నిలుస్తున్నారు. "ధోని ఆ లోగో అలానే ఉంచుకో.. దేశం మొత్తం నీకు మద్దతుగా ఉంది. అవసరమైతే ప్రపంచకప్‌నే బాయ్‌కాట్‌ చేద్దాం" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. "ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనని" మరోక నెటిజన్ కామెంట్ పెట్టాడు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిమానులు ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. అయితే, తాజాగా ఐసీసీ స్పష్టం చేసిన నేపథ్యంలో భారత్‌ ఆడే తదుపరి మ్యాచ్‌లకు ధోనీ తన గ్లోవ్స్‌పై ఆ చిహ్నాన్ని తొలగించాల్సి ఉంటుంది

Story first published: Saturday, June 8, 2019, 9:33 [IST]
Other articles published on Jun 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X