వరల్డ్‌కప్‌లో టీమిండియా నమోదు చేసిన ఉత్తమ, చెత్త రికార్డులివే

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సాధించిన ఉత్తమ, చెత్త రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం...

వరల్డ్ కప్‌లో టీమిండియా నమోదు చేసిన అత్యుత్తమ రికార్డులు
- 1975 వరల్డ్‌కప్‌లో బిషన్ సింగ్ బేడీ బంతితో మాయ చేశాడు. ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12-8-6-1 గణాంకాలను నమోదు చేశాడు. బిషన్ సింగ్ బేడీ వేసిన 12 ఓవర్లలో 8 ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం.
- 1983 గ్రూప్ దశలో వెస్టిండీస్‌పై ఓటమి ఖాయమైన వేళ.. యశ్‌పాల్ శర్మ 89 పరుగులతో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు.
- 1983లో ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 175 పరుగులతో జింబాబ్వేపై అద్భుత ప్రదర్శన చేశాడు.
- 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో ధోని సిక్సుతో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు.
- 2015లో ఓపెనర్ శిఖర్ ధావన్ 137 పరుగులతో సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది.
- భారత్ ఆరు ప్రపంచకప్‌ల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట రికార్డు ఉంది. సచిన్‌తోపాటు ఈ ఘనత సాధించిన వారిలో పాక్ ఆటగాడు జావెద్ మియాందాద్ ఉన్నాడు.
- 1975 వరల్డ్‌కప్‌లో సునీల్ గావస్కర్ 60 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 36 పరుగులు చేశాడు. గవాస్కర్ ఈ చెత్త ఇన్నింగ్స్ గురించి క్రికెట్ అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటారు.
- 2007 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడింది. ఈ వరల్డ్‌కప్‌లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని టీమిండియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

చేతన్ శర్మ
వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ చేతన్ శర్మ. 1987లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్‌ను, ఇయాన్ స్మిత్, ఎవెన్ ఛాట్‌ఫ్టీల్డ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ముగ్గురినీ చేతన్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.

సిక్స్‌తో ధోని విజయం

వరల్డ్‌కప్‌లో టీమిండియా చెత్త రికార్డు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications