న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. ఇంగ్లాండ్‌లో డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం

ICC Cricket World Cup 2019: Steve Smith and David Warner booed, called cheats against England in World Cup warm up

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ అభిమానులు వార్నర్‌ను 'చీటర్‌' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతేడాది స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. వీరితో పటు కామెరూన్ బెంక్రాఫ్ట్ కూడా నిషేదానికి గురైన విషయం తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

 ప్రపంచకప్‌కు ఎంపిక:

ప్రపంచకప్‌కు ఎంపిక:

నిషేధం ఉండగానే బిగ్ బాష్, ఐపీఎల్ వంటి టోర్నీలో అదరగొట్టడం.. నిషేధం ముగియడంతో ఆసీస్ బోర్డు స్మిత్, వార్నర్‌లను ప్రపంచకప్‌కు ఎంపిక చేసింది. దీంతో ప్రపంచకప్‌ కోసం స్మిత్‌, వార్నర్‌లు ఇంగ్లాండ్‌ వెళ్లారు. శనివారం ఆసీస్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన వార్నర్‌కు అభిమానుల నుండి చేదు అనుభవం ఎదురైంది.

మైదానం నుంచి వెళ్లిపో:

మైదానం నుంచి వెళ్లిపో:

ఓపెనర్‌గా వార్నర్‌ క్రీజులోకి రాగానే అభిమానులు దూషించడం మొదలెట్టారు. 'నువ్వు ఓ మోసగాడివి, మైదానం నుంచి వెళ్లిపో' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వార్నర్‌ వీటన్నింటిని పట్టించుకోకుండా బ్యాటింగ్‌ చేశాడు. కొందరు ప్రేక్షకులు వార్నర్‌ ఫొటోతో పాటు 'చీటర్‌' అని రాసి ఉన్న టీ షర్టులను ధరించారు. మరికొందరు బంతి ఆకారంలో ఉన్న దుస్తులను ధరించి చేతిలో శాండ్‌ పేపర్‌ను పెట్టుకుని స్టేడియానికి వచ్చారు.

55 బంతుల్లో 43 పరుగులు:

55 బంతుల్లో 43 పరుగులు:

అభిమానులు ఎన్ని చేసినా.. అవన్ని పట్టనట్టు వార్నర్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ (55 బంతుల్లో 43; 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. కష్టాల్లో పడ్డ ఆసీస్ ఇన్నింగ్స్‌ను షాన్ మార్ష్‌ (30)తో కలిసి గాడిలో పెట్టాడు. అనంతరం స్మిత్ బ్యాట్ జులిపించడంతో (102 బంతుల్లో 116; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) .. ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Sunday, May 26, 2019, 13:08 [IST]
Other articles published on May 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X