టాప్ అందుకునేనా?: టీమిండియా Vs శ్రీలంక హెడ్ టు హెడ్ రికార్డులివే!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం టీమిండియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే ఆఖరి మ్యాచ్. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు శనివారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడుతున్నాయి. శ్రీలంకపై టీమిండియా గెలిచి... దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడితే కోహ్లీసేన పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరుతుంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచే నిష్క్రమించింది.
కాగా, టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక విషయానికి వస్తే ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి మూడింట ఓడింది.
రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. లీగ్ స్టేజిలో ఆడనున్న ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-శ్రీలంక మ్యాచ్ విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే...:

మ్యాచ్ డిటేల్స్
తేదీ: శనివారం, 6th July 2019
సమయం: 03:00 PM IST
వేదిక: హేడింగ్లే, లీడ్స్
లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్ వర్క్
ఆన్ లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

వేదిక గణాంకాలు
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి: 228
రెండో ఇన్నింగ్స్ యావరేజి: 209
అత్యధిక స్కోరు: 351/9 (50 Ov) by ENG vs PAK

హెడ్ టు హెడ్ రికార్డు
Total: 158
Sri Lanka: 56
India: 90
Tied: 01
N/R: 11
ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్ రికార్డు
Total: 08
Sri Lanka: 04
India: 03
N/R: 01

కీలక ఆటగాళ్లు
ఇండియా: కుశాలీ పెరీరా, కుశాల్ మెండిస్, లసిత్ మలింగ
శ్రీలంక: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా

జట్ల వివరాలు
శ్రీలంక: కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్, ఆవిష్కా ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వా, ఏంజేలో మాథ్యూస్, జెఫ్రీ వాంజర్ సే, లాహిరు తిరుమన్నే, ఇరుసు ఉదాన, సురంగ లక్మల్, లసిత్ మలింగ
ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధోని, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

జట్ల వివరాలు
శ్రీలంక: కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్, ఆవిష్కా ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వా, ఏంజేలో మాథ్యూస్, జెఫ్రీ వాంజర్ సే, లాహిరు తిరుమన్నే, ఇరుసు ఉదాన, సురంగ లక్మల్, లసిత్ మలింగ
ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధోని, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications