న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని స్ఫూర్తిగా తీసుకోండని సూచిస్తుంటా: ద్రవిడ్‌

ICC Cricket World Cup 2019: Rahul Dravid reveals Virat Kohli’s success mantra, lauds big-match player MS Dhoni

అండర్‌-19 ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని స్ఫూర్తిగా తీసుకోండని సూచిస్తుంటాను అని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్ తెలిపారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్‌ సీజన్-12లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విఫలమైన విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా కోహ్లీ విఫలం కావడంతో ప్రపంచకప్‌లో అతని కెప్టెన్సీపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై రాహుల్‌ స్పందించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'గత కొన్ని రోజులుగా కోహ్లీ గమనిస్తున్నాను. ప్రతి మ్యాచ్‌లో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మరింత బాగా ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో సచిన్‌ 49-50 శతకాలు చేశారు. ఇన్ని శతకాలు చేయాలంటే చాలా సమయం పడుతుందని అనుకుకున్నాం. కానీ కోహ్లీ మాత్రం సచిన్‌ రికార్డుకు 10 శతకాల దూరంలో ఉన్నాడు' అని ద్రవిడ్‌ అన్నారు.

'ఏదైనా ఒక పర్యటనలో కోహ్లీ విఫలమయితే.. మరో పర్యటనలో ఆ తప్పులను సరిదిద్దికుంటడు. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో నిరాశపరినా.. ఆ తర్వాత పర్యటనలో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాలోనూ ఇదే చేసి చూపించాడు. విఫలమయిన మ్యాచుల్లో వైఫల్యాలను గుర్తించి అధిగమించడం వలనే కోహ్లీ పరుగులు చేస్తున్నాడు' అని ద్రవిడ్‌ తెలిపారు.

'ఐసీసీ టోర్నమెంట్లు ఆడేటప్పుడు ధోనీ బాగా ఆడతాడు. ఏ జట్టులోనైనా కెప్టెన్ అనేవాడు ఆడాలి.. ఆడించాలి. ధోనీ ఇందులో విజయం సాధించాడు. అండర్‌-19 ఆటగాళ్లకు ధోనీని స్ఫూర్తిగా తీసుకోండని సూచిస్తుంటాను' అని ద్రవిడ్‌ తెలిపారు. ప్రపంచకప్‌ మే 30 నుండి ప్రారంభమవనుండగా.. జూన్ 5న టీంఇండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Story first published: Saturday, May 18, 2019, 18:50 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X