న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈ సారి రాత మారుస్తాం.. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తాం'

ICC Cricket World Cup 2019 : Inzamam Hopeful Of Pak Ending Losing Streak Over India || Oneindia
ICC Cricket World Cup 2019: Inzamam Hopeful of Snapping Losing World Cup Streak Against India

ప్రపంచకప్‌లో ఈ సారి భారత్‌ను ఓడిస్తాం.. రాత మారుస్తాం అని పాకిస్థాన్‌ చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌-ఉల్‌-హక్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్, భారత్ ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. అయితే జూన్‌ 16న మాంచెస్టర్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కచ్చితంగా గెలుస్తుందని ఇంజి పేర్కొన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్‌పై మాత్రం గెలవాల్సిందే:

భారత్‌పై మాత్రం గెలవాల్సిందే:

ఇంజిమామ్‌ మాట్లాడుతూ... 'భారత్‌, పాక్‌ మ్యాచ్‌ను అభిమానులు, ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారు. ప్రపంచకప్‌లో ఇతర జట్లపై గెలవకున్నా పర్వాలేదు.. కానీ ఒక్క భారత్‌పై మాత్రం గెలవాల్సిందే' అని అంటారు. 'ప్రపంచకప్‌ అంటే భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఒక్కటే కాదు, అన్ని జట్లపైనా గెలవాలి. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తాం.. రాత మారుస్తాం' అని ఇంజిమామ్‌ అన్నాడు.

ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చెయ్యడం కష్టం:

ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చెయ్యడం కష్టం:

ఇటీవల పాక్‌ జట్టులో చోటు చేసుకున్న మార్పులపై ఇంజిమామ్‌ అసహనం వ్యక్తం చేసాడు. 'ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చెయ్యడం అంత సులభతరం కాదు. ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎంపిక చెయ్యడం కష్టంతో కూడుకున్నది. అందరూ బాగా ఆడితే ఎవరిని ఎంపిక చెయ్యాలో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. జట్టును ఎంపిక చేయడం ఒత్తిడితో కూడుకున్న విషయం' అని ఇంజి పేర్కొన్నాడు.

ఏ జట్టునీ తక్కువ అంచనా వేయొద్దు:

ఏ జట్టునీ తక్కువ అంచనా వేయొద్దు:

'ప్రపంచకప్‌లాంటి టోర్నీల్లో ఏ జట్టునీ తక్కువ అంచనా వేయొద్దు. అఫ్గానిస్థాన్‌ లాంటి చిన్న జట్టు కూడా పెద్ద జట్లకు షాక్ ఇవ్వగలదు. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యాచ్‌ జాగ్రత్తగా ఆడాలి. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాదించి పాయింట్లు మెరుగుపరుచుకోవాలి. మెగా టోర్నీలో మంచి శుభారంభం అవసరం. టోర్నీలో ఇంగ్లాండ్‌, భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఫెవరేట్. వీటితో పాటు పాకిస్థాన్‌ కూడా ఉంది' అని ఇంజి చెప్పుకొచ్చారు.

Story first published: Monday, May 27, 2019, 12:24 [IST]
Other articles published on May 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X