న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ అభిమానులను ఆకర్షించిన 'హైదరాబాద్ ఐబీ క్రికెట్'

ICC Cricket World Cup 2019: Hyderabad Based iB Cricket goes Global engaging fans for Cricket WC19

క్రికెట్‌ కేవలం చూడడమే కాదు, స్వయంగా మీరే ఓ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల మధ్య విరాట్ కోహ్లీలా సొగసైన షాట్‌లు కొడితే. మీరు కొట్టిన ఫోర్‌లు, సిక్స్‌లకు గ్యాలరీ మొత్తం కేరింతలతో నిండిపోతే! ఆ మజానే వేరు. ఇప్పుడు ఈ మజానే 'హైదరాబాద్ ఐబీ క్రికెట్' ద్వారా క్రికెట్ అభిమానులు అనుభవిస్తున్నారు.

ఐబీ క్రికెట్ అంటే:

ఐబీ క్రికెట్ అంటే:

ఐబీ క్రికెట్ అంటే.. ఒక వర్చువల్ రియాలిటీ క్రికెట్. మీరే ఒక అంతర్జాతీయ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య, ఫీల్డర్లు, అంపైర్లతో ఒక అంతర్జాతీయ క్రికెటర్లా ఆడేయొచ్చు. ప్రపంచంలోని ఈ తరహా గేముల్లో వాస్తవిక ప్రపంచానికి అత్యంత దగ్గరగా ఉండేలా తయారు చేయబడిన వాటిలో ఐబీ క్రికెట్ మొట్టమొదటిది.

భారత్ ఆర్మీతో భాగస్వామ్యం:

భారత్ ఆర్మీతో భాగస్వామ్యం:

అతిపెద్ద క్రికెట్ పండగ ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. అభిమాన క్రికెటర్ల అద్భుతమైన పోరాటాలతో రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతోంది. అంబరాన్నంటే ఈ క్రికెట్ సంబరాలను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐబీ క్రికెట్.. 'ఐబీ క్రికెట్ ప్రపంచకప్‌ ఫ్యాన్ టూర్' ను ఇండియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, శ్రీలంక, దుబాయ్ మొదలైన దేశాల్లో నిర్వహిస్తోంది. ఇంగ్లండ్‌లోని క్రికెట్ అభిమానులను అలరించడానికి భారత్ ఆర్మీతో చేతులు కలిపింది ఐబీ క్రికెట్.

స్పెషల్ జోన్స్:

స్పెషల్ జోన్స్:

అంతర్జాతీయ స్టేడియంలో ఆడాలనే క్రికెట్ అభిమానుల కలను నిజం చేసుకునేందుకు ఐబీ క్రికెట్ సువర్ణావకాశం. ఐబీ క్రికెట్ ఆడేందుకు మొత్తం 5 దేశాల్లో స్పెషల్ ఎక్స్పీరియన్స్ జోన్లను ఏర్పాటు చేశారు. ఐబీ క్రికెట్ మనోరంజకమైన ఆటతీరు, రన్నింగ్ కామెంట్రీ, ఉత్సాహపరిచేందుకు స్టేడియం నిండా ప్రేక్షకులు, పునః సమీక్ష చేసుకోవడానికి రీప్లేలు, బాల్ వేగాన్ని లెక్కకట్టడానికి హాక్ఐ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రుతలూగిస్తోంది. మొత్తం 5 దేశాల్లో ఐబీ క్రికెట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా విస్తరిస్తూ ఉంది. అస్సలు క్రికెట్టే ఆడని దేశాలతో కలిపి 30కి పైగా దేశాల ప్రజలు ఇప్పటికే 1 మిలియన్ (పది లక్షలు) బాల్స్ ఆడి ఐబీ క్రికెట్ ను మెచ్చుకున్నారు. 98% కంటే ఎక్కువ మంది అత్యద్భుతంగా ఉంది, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అని కొనియాడారు.

 నిజమైన క్రికెట్ ఆడినట్టే:

నిజమైన క్రికెట్ ఆడినట్టే:

50కి పైగా అంతర్జాతీయ క్రికెటర్ల మన్ననలను వీస్పోర్ట్ (వర్చువల్ రియాలిటీ స్పోర్ట్) పొందింది. ఇప్పటి వరకూ విరాట్ కోహ్లీ, హర్షల్ గిబ్స్, మోర్ని మార్కెల్, సామ్ బిల్లింగ్స్, తిలకరత్న దిల్షాన్, చిరాగ్ సూరి వంటి 50 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఆడి నిజమైన క్రికెట్ ను ఆడిన అనుభూతినిచ్చిందని మెచ్చుకున్నారు.

ఐపీఎల్-12లో కూడా:

ఐపీఎల్-12లో కూడా:

గత ఐపీఎల్-12లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మొదలైన జట్ల భాగస్వామ్యంలో ఐబీ క్రికెట్ ఐపీఎల్ ఫ్యాన్ టూర్లను నిర్వహించారు. ఈ జట్ల హోమ్ టౌన్లలో 140 ఈవెంట్లు ఏర్పాటు చేసి క్రికెట్ ను అభిమానులకు మరింత చేరువయ్యేలా చేశారు. ఐబీ క్రికెట్ ఆ జట్ల అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.

Story first published: Tuesday, June 25, 2019, 16:22 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X