న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రిటైర్‌ అవ్వడు.. విమర్శకులపై వార్న్‌ ఆగ్రహం

ICC World Cup 2019:MS Dhoni Can Retire Whenever He Wants, Says Shane Warne
ICC Cricket World Cup 2019: Can Retire Whenever He Wants says Shane Warne, Hits Out MS Dhoni Critics

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీకి తాను ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో తెలుసు. ఈ విషయంపై విమర్శకులు పెద్ద రాద్ధాంతం చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ధోనీ అత్యంత కీలకం. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అద్భుత ఫామ్‌లో ఉన్నా:

అద్భుత ఫామ్‌లో ఉన్నా:

ఈ మధ్య కాలంలో ధోనీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయినా కొందరు ధోనీపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ప్రపంచకప్‌ జట్టులో పంత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు. ధోనీ రిటైర్మెంట్‌ తీసుకుని యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో షేన్‌ వార్న్‌ స్పందించారు.

ఎందుకు రిటైర్‌ కావాలో చెప్పాలి:

ఎందుకు రిటైర్‌ కావాలో చెప్పాలి:

'భారత క్రికెట్‌కు ధోనీ మంచి సేవకుడు. భారత క్రికెట్‌కు కావాల్సిన ప్రతి ఒక్కటి అందజేశాడు. అయినా కొంతమంది ధోనీపై విమర్శలు చేయడం, ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయవద్దని వ్యాఖ్యానించడం అర్ధరహితం. ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ధోనీ ఎందుకు రిటైర్‌ కావాలో విమర్శకులు చెప్పాలని' వార్న్‌ ప్రశ్నించారు.

అతనే తప్పుకుంటాడు:

అతనే తప్పుకుంటాడు:

'ప్రతి ఒక్క ఆటగాడికి తాను ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో ఓ అవగాహన ఉంటుంది. అది ధోనీకి కూడా తెలుసు. రిటైర్మెంట్‌ ప్రపంచకప్‌ అనంతరమా? లేక మరో ఐదేళ్ల తర్వాతా? అనేది అతని ఇష్టమే. కావాల్సింది సాధించే వరకు ధోనీ రిటైర్‌ అవ్వడు. సరైన సమయంలో అతనే తప్పుకుంటాడు' అని షేన్‌ వార్న్‌ చెప్పుకొచ్చారు.

12 ఇన్నింగ్స్‌లు 416 పరుగులు:

12 ఇన్నింగ్స్‌లు 416 పరుగులు:

గతేడాదిగా ధోనీ అద్భుత ఫామ్‌లో ఉ‍న్నాడు. 2018లో 9 మ్యాచ్‌లు ఆడి 81.75 సగటుతో 327 పరుగులు చేశాడు. ఐపీఎల్‌-12లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బ్యాటింగ్‌, కీపింగ్‌తో మెరిశాడు. 12 ఇన్నింగ్స్‌లలో 83.20 సగటుతో 416 పరుగుల చేశాడు. ధోనీ సారథ్యంలో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ (207), వన్డే ప్రపంచకప్‌ (2011), చాంపియన్స్‌ ట్రోఫీ (2013)లు అందుకుంది. ధోనీ సారథ్యంలోనే భారత్‌ టెస్ట్ వన్డేలలో నంబర్.1గా నిలిచింది.

Story first published: Tuesday, May 28, 2019, 14:18 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X