న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్ల హాఫ్ సెంచరీలు.. ఆసీస్ స్కోర్ 132/1

ICC Cricket World Cup 2019, Australia vs Bangladesh: Openars smashesh Half Centurys, David Warner & Usman Khawaja Look to Rebuild Australia Innings

ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు చేశారు. మొదటగా వార్నర్ 55 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లుతో హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. రుబెల్‌ బౌలింగ్‌లో 16వ ఓవర్ ఆఖరి బంతిని ఫైన్‌ లెగ్‌ మీదుగా సింగిల్‌ తీసి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1
43669

అనంతరం ఫించ్‌ (53; 51బంతుల్లో 5×4, 2×6) కూడా హాఫ్ సెంచరీ చేసాడు. మెహిది వేసిన 20వ ఓవర్‌ నాలుగో బంతికి ఫోర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ అనంతరం సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో ఫించ్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఫించ్ ఔట్ అయినా.. వార్నర్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఫించ్ అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా నిదానంగా ఆడుతున్నాడు. 8 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసాడు. 24 ఓవర్లకు ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్ (68), ఖవాజా (4) క్రీజులో ఉన్నారు. సౌమ్య సర్కార్‌ రెండు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

Story first published: Thursday, June 20, 2019, 16:58 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X