న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటగాళ్ల తీరు మారేనా?: కొత్త నిబంధనలకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్

By Nageshwara Rao
ICC approves harsher penalties for ball-tampering

హైదరాబాద్: ఇకపై క్రికెట్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధాన్ని ఆటగాళ్లు ఎదుర్కొనున్నారు. అవును. మీరు చదివింది నిజమే. ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు హద్దు మీరి, గేమ్ పరువు తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఐసీసీ మరిన్ని కఠిన నిబంధనలను తీసుకొచ్చింది.

సోమవారం డబ్లిన్‌ వేదికగా జరిగిన సమావేశంలో పలు కొత్త నిబంధనలకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాబోయే రోజుల్లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్పష్టంచేశారు. ఇందుకు తగ్గట్లు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇకపై బాల్ టాంపరింగ్ లెవెల్-3 తప్పిదం

ఇకపై బాల్ టాంపరింగ్ లెవెల్-3 తప్పిదం

తాజా నిబంధనల ప్రకారం బాల్ టాంపరింగ్‌ను లెవెల్-3 తప్పిదం కిందకు తీసుకొచ్చింది. గతంలో బాల్ టాంపరింగ్‌ను లెవెల్-2 తప్పిదంగా పరిగణించేవారు. బాల్ టాంఫరింగ్‌కు పాల్పడితే గరిష్ఠంగా 12 సస్పెన్షన్ పాయింట్లు విధిస్తారు. ఇది ఆరు టెస్టులు లేదా, 12 వన్డేల నిషేధానికి సమానం.

సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌

సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌

ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్ క్రాప్ట్‌‌పై తొమ్మిది నెలలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

కఠిన శిక్షలను రికమెండ్ చేసిన ఐసీసీ క్రికెట్ కమిటీ

కఠిన శిక్షలను రికమెండ్ చేసిన ఐసీసీ క్రికెట్ కమిటీ

మోసం చేయడం, వ్యక్తిగతంగా దూషించడం, అసభ్యకరంగా వ్యవహరించడం, అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడం లాంటివి చేస్తే ఇకపై క్రికెటర్లకు మరింత కఠిన శిక్షలను ఐసీసీ అమలు చేయనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ కఠిన శిక్షలను రికమెండ్ చేసినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపారు.

తమ ప్లేయర్స్ వ్యవహార తీరుకు బోర్డుదే బాధ్యత

తమ ప్లేయర్స్ వ్యవహార తీరుకు బోర్డుదే బాధ్యత

ఇందులో వ్యక్తిగత దూషణ, బాల్ టాంపరింగ్ లాంటి ఘటనలకుగాను కఠిన శిక్షలను అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ ప్లేయర్స్ వ్యవహార తీరుకు సంబంధిత క్రికెట్ బోర్డులను కూడా బాధ్యులను చేసే నిబంధనను కూడా ఐసీసీ పరిగణలోకి తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

Story first published: Tuesday, July 3, 2018, 13:00 [IST]
Other articles published on Jul 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X