న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యుత్తమ వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరే!!

 ICC Announce Womens World T20 2020 Team of the Tournament

దుబాయ్‌: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2020 చాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచిన విషయం తెలిసిందే. భారత అమ్మాయిలతో ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ 85 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుని ఐదో సారి విశ్వ కిరీటాన్ని ముద్దాడింది. టోర్నీ ఆద్యాంతం ఆకట్టుకున్న భారత మహిళలు ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరి.. ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు.

పూనమ్ యాదవ్ ఒక్కతే..

అయితే ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది సభ్యులతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) బెస్ట్ వరల్డ్‌కప్‌ టీమ్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ సారథ్యంలోని ఈ జట్టు వివరాలను సోమవారం ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరి ప్లేయర్లకే అవకాశం కల్పించింది. అందులో ఒకరు ఎక్స్‌ట్రా ప్లేయరే. భారత్ నుంచి స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ఐసీసీ ఎలెవన్‌ జాబితాలో చోటు దక్కించుకోగా.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన షెఫాలీ వర్మను 12వ ప్లేయర్‌గా ఎంపికైంది.

ఆసీస్ నుంచే ఐదుగురు..

ఆసీస్ నుంచే ఐదుగురు..

విశ్వవిజేతగా నిలిచి ఆసీస్ నుంచే ఐదుగురు ప్లేయర్లు ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి నలుగురు, సౌతాఫ్రికా నుంచి ఒకరిని ఎంపిక చేసింది. ఫైనల్లో సంచలన ప్రదర్శన కనబర్చిన అలెసా హీలీ, బెత్ మూనీ, మెగన్ షుట్, జొనాసేన్‌లతో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్‌లకు ఈ జట్టులో చోటుదక్కింది. ఇంగ్లండ్ నుంచి నాట్ స్కీవర్, హీథర్ నైట్,అన్యా ష్రబ్ సోల్, సోఫీ ఎక్సలీస్టోన్‌లు ఎంపికవ్వగా.. సఫారీ టీమ్ నుంచి లౌరా వాల్వార్డ్ ఒక్కతే అవకాశం దక్కించుకుంది.

షెఫాలీ 12 వ ప్లేయరా?

ఇక భారత యువ సంచలనం షెఫాలీ వర్మను 12వ ప్లేయర్‌గా ప్రకటించడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్క ఫైనల్ మినహా టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన షెఫాలీ 12వ ప్లేయర్ ఏందని మండిపడుతున్నారు. అసలు భారత్ ఫైనల్ చేరిందే తన వల్లని ఈ విషయం ఐసీసీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

మొన్నటికి మొన్న ఈ ప్రదర్శనతోనే కదా ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు తుది జట్టులో చోటెందుకు దక్కదంటున్నారు. ఈ మెగా టోర్నీలో షెఫాలీ మొత్తం ఐదు మ్యాచుల్లో కలిపి 163 పరుగులు చేసింది. అత్యధికంగా శ్రీలంకపై 47 పరుగులు చేసింది.

ఐసీసీ బెస్ట్ వరల్డ్‌కప్‌ టీమ్‌..

ఐసీసీ బెస్ట్ వరల్డ్‌కప్‌ టీమ్‌..

మెగ్‌ లానింగ్‌(కెప్టెన్‌), అలెసా హీలీ(వికెట్‌ కీపర్‌), బెత్‌ మూనీ, నాట్‌ స్కీవర్‌, హీథర్‌ నైట్‌, లౌరా వాల్వార్డ్‌, జెస్‌ జొనాసేన్‌, సోఫీ ఎక్సలీస్టోన్‌(ఇంగ్లండ్‌), అన్యా ష్రబ్‌సోల్‌, మెగాన్‌ స్కట్‌, పూనమ్‌ యాదవ్‌, షెఫాలీ వర‍్మ( 12వ ప్లేయర్)

Story first published: Monday, March 9, 2020, 17:01 [IST]
Other articles published on Mar 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X