న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ పాజీతో మాట్లాడిన తర్వాతే.. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా ఎదిగా: కోహ్లీ

I came back and spoke to Sachin paaji: How Sachin Tendulkar helped Virat Kohli after 2014 England debacle

ముంబై: 2014 ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోర వైఫల్యం తర్వాత తాను ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా మారడానికి క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఇచ్చిన సూచనలు ఎంతో మేలు చేశాయని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అలాంటి ఆటగాడు 2014 ఇంగ్లండ్‌ పర్యటనలో విఫలమైన సంగతి తెలిసిందే. అతడి కెరీర్‌లో అంత ఘోరంగా విఫలమైంది ఎన్నడూ లేదు. ఆ సిరీస్‌లో కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లో 13.40 సగటుతో కేవలం 134 పరుగులే చేశాడు.

అదో మైలురాయి:

అదో మైలురాయి:

ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదాడు. బీసీసీఐ టీవీ కోసం మయాంక్‌ అగర్వాల్‌తో ఓ కార్యక్రమంలో మాట్లాడిన విరాట్ ఆ మార్పు వెనక కారణాలను వివరించాడు. '2014 ఇంగ్లండ్‌ పర్యటన నా కెరీర్‌లో ఓ మైలురాయి. చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసిన సిరీస్‌లను మైలురాయిగా చెప్పుకుంటారు. నాకు మాత్రం ఇంగ్లండ్‌తో ఆ సిరీసే మైలురాయి. ఆ సిరీస్‌ ముగించుకుని స్వదేశం చేరుకున్న తర్వాత నా బ్యాటింగ్‌ గురించి సచిన్‌తో మాట్లాడా. బ్యాటింగ్‌ సమయంలో నా తుంటి స్థానంపై దృష్టిసారించాలనుకుంటున్నట్లు తనతో చెప్ఫా' అని విరాట్ తెలిపాడు.

ఫార్వర్డ్‌ ప్రెస్‌ గురించి సచిన్‌ పాజీతో మాట్లాడా:

ఫార్వర్డ్‌ ప్రెస్‌ గురించి సచిన్‌ పాజీతో మాట్లాడా:

'నా సమస్యను చెప్పగానే సచిన్‌ ఓ సలహా ఇచ్చారు. ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ఫార్వర్డ్‌ ప్రెస్‌ (బౌలర్‌ బంతి వేయగానే కుడి చేతివాటం బ్యాట్స్‌మన్‌ తన ఎడమకాలిని ముందుకు తేవడంతో అతని శరీర బరువు మొత్తం ముందుకు రావడం) ప్రాముఖ్యతను నాకు వివరించారు. దాన్ని అనుసరించడంతో ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన చేయగలిగా. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదా. అప్పడు నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

సమతౌల్యం పాటించగలిగితే:

సమతౌల్యం పాటించగలిగితే:

'ఇంగ్లండ్‌ సిరీస్‌లో హిప్‌ సర్దుబాటు కుదరలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా తుంటి భాగం కదలకపోవడంతో.. నేను అనుకున్న విధంగా ఆడలేకపోయాను. కుడి తుంటి భాగం ఎక్కువ కదిలినా.. తక్కువ కదిలినా ఇబ్బందే. సమతౌల్యం పాటించగలిగితే ఆఫ్‌సైడ్‌, ఆన్‌సైడ్‌లో పూర్తి నియంత్రణలో షాట్‌లు ఆడొచ్ఛు. ఇంగ్లండ్‌లో బంతి లోపలికి వస్తుందేమోనని నేను తొందరపడి ముందే బ్యాట్‌ను ఓపెన్‌ చేసేవాణ్ని. కానీ అది ఔట్‌ స్వింగ్‌ కావడంతో ఔట్‌ అయ్యేవాణ్ని. కానీ సచిన్‌ చెప్పిన తర్వాత దాన్ని సరిచేసుకున్నా' అని భారత కెప్టెన్ పేర్కొన్నాడు.

 రవిశాస్త్రి సలహా:

రవిశాస్త్రి సలహా:

'పేసర్ల బౌలింగ్‌లో క్రీజు బయట నిలబడి బ్యాటింగ్‌ చేయమని అప్పుడు జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి సూచించాడు. అలా అయితే మనం ఎంచుకున్న షాట్‌ను ఆడే సౌలభ్యం ఎక్కువగా ఉంటుందని, మనల్ని ఔట్‌ చేసే అవకాశం బౌలర్‌కు ఇవ్వకుండా ఉంటామని చెప్పాడు. నాతో పాటు శిఖర్‌ ధావన్‌ సైతం శాస్త్రి వద్ద ప్రత్యేక సెషన్‌ తీసుకున్నాడు' అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్‌ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్‌ మార్చుకుని ఆసీస్‌ టూర్ ‌(2014-15)లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు.

హమ్మయ్య.. మళ్లీ ఎంఎస్ ధోనీ ఆట చూడబోతున్నాం: కిదాంబి శ్రీకాంత్‌

Story first published: Saturday, July 25, 2020, 12:49 [IST]
Other articles published on Jul 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X