న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో డ్యాన్స్ చేసిన ఘటనపై విరాట్ కోహ్లీ వివరణ (వీడియో)

I believe in enjoying the moment, says Virat Kohli about him dancing to the music on the field

హైదరాబాద్: మ్యూజిక్ విన్నప్పుడు తనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

తొలి వన్డే సందర్భంగా ఓ వైపు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుంటే.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలోనే డీజే పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుంటే.. మైదానంలో కోహ్లీ మాత్రం అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాడు.

<strong>What a player: వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్</strong>What a player: వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్

విరామం అనంతరం మైదానంలోకి

విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ డీజే పాటలకు స్టెప్పులు వేసాడు. డీజేకు అనుగుణంగా సహచర ఆటగాళ్లతో డాన్స్ చేసాడు. క్రిస్ గేల్ కూడా తనదైన శైలిలో కోహ్లీతో కలిసి డాన్స్ చేసాడు. అనంతరం మైదాన సిబ్బందితో సైతం సరదాగా గడిపాడు. కోహ్లీ స్టెప్పులు వేయడంతో మైదానంలోని అభిమానులు ఆనందించారు.

రెండో వన్డేలో టీమిండియా విజయం

రెండో వన్డేలో టీమిండియా విజయం

తాజాగా, ఆదివారం ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది.

బద్దలైన రికార్డులవే: సచిన్‌కి 7 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ

డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన

డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. అయితే, లక్ష్య చేధనలో వెస్టిండిస్ జట్టు 27 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్నా... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

చాహల్ టీవీకి కోహ్లీ ఇంటర్యూ

చాహల్ టీవీకి కోహ్లీ ఇంటర్యూ

రెండో వన్డే అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ... యజువేంద్ర చాహల్‌తో కలిసి చాహల్ టీవీకి ఇంటర్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "నేను మైదానంలో తెగ ఎంజాయ్ చేశాను. నేను కెప్టెన్ అయినా ఒక నిర్దిష్ట మార్గంలో నటించడాన్ని నమ్మను. దేవుడు నాకు ఇంత గొప్ప జీవితాన్ని, నా జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఇచ్చాడు. డే టైమ్‌లో వర్షం పడటంతో ఈ రోజు సవాలుగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే, నేను 65 పరుగులకు చేరుకోగానే అలసిపోయాను. అయితే, పరిస్థితులు నన్ను జట్టు కోసం ఆడేలా చేశాయి. ఆ సమయంలో నేను క్రీజులో ఉండటం ఎంతో ముఖ్యం. టాప్-3 బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు చేరడంతో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యతనాపై ఉంది" అని కోహ్లీ తెలిపాడు.

నా జీవితంలో మంచి స్థానంలో ఉన్నా

నా జీవితంలో మంచి స్థానంలో ఉన్నా

"అంతకముందు ధావన్, రోహిత్‌లు అలానే ఆడారు. అయితే, ఈరోజు వాళ్లిద్దరూ భారీ స్కోర్లు చేయలేక పోయారు. దీంతో నేను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. ప్రతి క్షణాన్ని ఆనందించాలని నేను నమ్ముతున్నాను. నేను నా జీవితంలో మంచి స్థానంలో ఉన్నాను, అందుకే మ్యూజిక్ విన్నప్పుడల్లా నాకు డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది. భాంగ్రా ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది, కానీ గ్రూవి మ్యూజిక్ ఉంటే సహజంగా నా కాలు కదులుతుంది" అని విరాట్ కోహ్లీ చాహల్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు.. గంగూలీని అధిగమించిన కోహ్లీ

జట్టు కోసం కష్టపడటమే నా మనస్తత్వం

"జట్టు కోసం కష్టపడటమే నా మనస్తత్వం. ఇది కీలకమైన క్యాచ్ లేదా రనౌట్ అయినా, నేను జట్టు కోసం చేయాలనుకుంటున్నాను. మీరు మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోతే, మీ స్థానానికి మీరు న్యాయం చేయడం లేదని నేను భావిస్తాను. నా జీవనశైలి, శిక్షణ, ఆహారం టీమిండియాకు దోహదపడే విధంగా ఉంచుతాను" అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, August 12, 2019, 16:45 [IST]
Other articles published on Aug 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X