న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ నేనే యూనివర్సల్ బాస్: తొలి వన్డే‌కి ముందు రిపోర్టర్లతో గేల్

I am still the Universe Boss: Chris Gayle

హైదరాబాద్: ఇప్పటికీ ప్రపంచంలో తానే గ్రేట్ ప్లేయర్‌నంటూ వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు క్రిస్ గేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మేలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నీ వన్డేల్లో అతడికి చివరి టోర్నీ. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. మేలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నీ వన్డేల్లో అతడికి చివరి టోర్నీ. ఈ నేపథ్యంలో ఓవల్ వేదికగా రిపోర్టర్లతో మాట్లాడిన క్రిస్ గేల్ ప్రపంచ క్రికెట్‌లో తానే గ్రేట్‌ ప్లేయర్‌నంటూ చెప్పుకొచ్చాడు.

<strong>కోహ్లీనే నంబర్‌వన్: 13 ఏళ్ల తర్వాత అగ్రస్థానంలో ఓ ఆసీస్ బౌలర్</strong>కోహ్లీనే నంబర్‌వన్: 13 ఏళ్ల తర్వాత అగ్రస్థానంలో ఓ ఆసీస్ బౌలర్

ICC World Cup 2019: West Indies Star Chris Gayle To Retire From Odis | Oneindia Telugu
మీరు గొప్ప వ్యక్తిని చూస్తున్నారు

మీరు గొప్ప వ్యక్తిని చూస్తున్నారు

"మీరు గొప్ప వ్యక్తిని చూస్తున్నారు. నేను వరల్డ్‌ క్రికెట్‌లో గొప్ప క్రికెటర్‌ని. ఇప్పటికీ నేనే యూనివర్శ్‌ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు" అని క్రిస్ గేల్‌ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ తర్వాత మీరు వన్డేలకు వీడ్కోలు పలకనున్నారా? అన్న ప‍్రశ్నకు గేల్‌ తనదైన శైలిలో బదులిచ్చాడు.

వరల్డ్‌కప్‌తో నా వన్డే కెరీర్ ముగుస్తుంది

వరల్డ్‌కప్‌తో నా వన్డే కెరీర్ ముగుస్తుంది

"నా వన్డే క్రికెట్‌ అనేది వరల్డ్‌కప్‌తో ముగుస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. యువ క్రికెటర్లకు మార్గదర్శిలా ఉంటా. వారి ఆటను ఎంజాయ్‌ చేస్తూ తిలకిస్తా" అని అన్నాడు. 39 ఏళ్ల గేల్‌ 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

లారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన గేల్

లారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన గేల్

వన్డే ఫార్మాట్‌లో బ్రియాన్‌ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండిస్ బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేలే కావడం విశేషం. అంతేకాదు వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన (2015 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్‌ క్రికెటర్‌ గేలే. విండిస్ తరుపున 284 వన్డేలాడిన గేల్ 9727 పరుగులు చేశాడు.

మంచి కండిషన్‌లో ఉన్నా

మంచి కండిషన్‌లో ఉన్నా

ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌పై ప్రస్తుతం క్రిస్ గేల్‌ దృష్టి సారించాడు. ఈ ఐదు వన్డేల సిరిస్‌లో సత్తా చాటడంతో పాటు వరల్డ్ కప్‌లోనూ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. "మంచి కండిషన్‌లో ఉన్నా. నా శరీరం కూడా చక్కటి ఫీలింగ్‌తో ఉంది. ఇప్పటికే కొంత బరువు తగ్గాను. బరువు పెరగాలని కోరుకోవడం లేదు. ఇప్పటికీ నా సిక్స్ ప్యాక్ కోసం వర్కౌట్లు చేస్తున్నా. యువ క్రికెటర్లతో పోటీ పడేందుకు నిరంతరం శ్రమిస్తున్నా" అని గేల్ తెలిపాడు.

Story first published: Monday, February 18, 2019, 12:57 [IST]
Other articles published on Feb 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X