మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్‌: టాప్ 10లో సింధు, మిథాలీలకు చోటు

Posted By:
 Hyderabad Times Most Desirable Women 2017: Take a bow, hotties!

హైదరాబాద్: టైమ్స్ గ్రూపు ప్రత్యేకంగా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ జాబితాలో టాలీవుడ్ కథానాయికలకు ధీటుగా పీవి సింధు, మిథాలీ రాజ్‌లు స్థానం సంపాదించారు. మిగిలిన స్థానాల్లో పూజా హెగ్దే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అదా శర్మ, సిమ్రాన్ చౌదరీ, తమన్నా భాటియా, సృష్టి వ్యాకరణం, అనుష్క శెట్టి ఉన్నారు.

గతేడాది జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ 4 సాధించిన పీవి సింధు హైదరాబాద్ టైమ్స్‌లోనూ నాలుగో స్థానంలోనే ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ఏడాది మొత్తం సక్సెస్‌ఫుల్ దూసుకుపోయిన సింధు యువతకు ఆదర్శంగా నిలిచారు.

అభిమానులతో పాటు అందరినీ ఆకర్షిస్తున్న ఆమెలోని సుగుణాలు ఇలా ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌కు మెరుగైన వ్యత్యాసం, ఆమె స్థాయి, ఓటమికి లొంగని మనస్తత్వం, ఆటతో సంపాదించుకున్న అభిమానం. ఇవే ఆమెను నాలుగో స్థానంలో నిలబెట్టాయి.

టాప్ 10లో స్థానం సంపాదించిన మిథాలీ రాజ్. ఆమె భారత మహిళా జట్టు కెప్టెన్ గా అద్భుతమైన ప్రదర్శన చేసి మహిళా క్రికెట్ క్రేజి పెంచారు. ఈమె హైదరాబాదీ కావడం విశేషం. ప్రపంచం మొత్తంలోనే 6000పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. ఈమె కెప్టెన్సీలోనే భారత జట్టు రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్ వరకూ వెళ్లింది. అంతేకాదు మ్యాగజైన్ యాడ్‌ల కోసం ఆమె ఇచ్చే ఫోజ్‌లు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి.

Story first published: Wednesday, March 14, 2018, 16:58 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి