న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌లో టాక్సీపై ఐపీఎల్ స్కోరు: 'When cricket is life' అంటూ ఐసీసీ ట్వీట్

Hyderabad Taxi Displaying Live IPL Score on its Rooftop Has Impressed ICC

హైదరాబాద్: భారత్‌లో క్రికెట్ ఓ మతం లాంటిది. క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పదకొండు సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 12వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ లీగ్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ 2019 సీజన్ క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో మ్యాచ్‌లను వీక్షించేందుకు గాను ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు చేరుకుంటున్నారు. తమ జట్లకు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఐపీఎల్ 2019 సీజన్‌కు ప్రచారం కల్పించేందుకు తమకు అందివచ్చిన అన్ని మార్గాలను టోర్నీ నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించలేని అబిమానులు కోసం టెలివిజన్ ఛానళ్లు, హాట్ స్టార్ లాంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు పలురకాల క్రికెట్ వెబ్‌సైట్లు సైతం మ్యాచ్‌లకు సంబంధించిన స్కోరు కార్డుని ప్రదర్శిస్తున్నాయి. అయితే, పైవన్నీ అందుబాటులో లేనివారి కోసం హైదరాబాద్ టాక్సీలు వినూత్న ప్రచారానికి తెరలేపాయి.

నగరంలో పలు టాక్సీలు తమ రూఫ్‌టాప్ పైభాగంలో ఐపీఎల్ 2019 సీజన్‌లో మ్యాచ్‌లకు సంబంధించిన స్కోరు కార్డు వివరాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ స్కోరు కార్డుని చూసిన ఓ రెడిట్ యూజర్ ధానిని ఫోటో తీసి తన ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోని ఐసీసీ సైతం ముచ్చట తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఫోటో కింద "When cricket is life" అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటోని వీక్షించిన అభిమానులు సైతం తమదైన శైలిలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

Story first published: Tuesday, April 9, 2019, 15:21 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X