న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ గొడవకు అభిమానులే కారణం : అండర్-19 క్రికెటర్

U19 World Cup Final 2020 : Tilak Varma Says 'Bagladesh Fans Are The Reason For The Clash'
 Hyderabad Cricketer Tilak Varma Says Fans Are Cause Of U19 World Cup final brawl

హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్ విజయానంతరం మైదానంలో చోటుచేసుకున్న గొడవకు అభిమానులే కారణమని హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ తెలిపాడు. మ్యాచ్‌కు అధిక సంఖ్యలో వచ్చిన బంగ్లాదేశ్ అభిమానులు.. తొలి సారి ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఆటగాళ్లను రెచ్చగొట్టారని ఈ హైదరాబాద్ స్టార్ చెప్పుకొచ్చాడు.

గత రెండేళ్లుగా భారత అండర్‌-19 టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన తిలక్ వర్మ తాజా వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫైనల్ ఓటమి అనంతరం బుధవారం స్వస్థలం చేరుకున్న అతను ఓ చానెల్‌కు ప్రత్యేక‌ంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా గొడవకు గురించి ప్రస్తావించగా.. వివాదానికి గల కారణాలను వెల్లడించాడు.

ఫోర్‌‌ డే టెస్ట్ మ్యాచ్‌లు‌ పనికొస్తాయా? ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది?ఫోర్‌‌ డే టెస్ట్ మ్యాచ్‌లు‌ పనికొస్తాయా? ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది?

 మా తప్పేమి లేదు..

మా తప్పేమి లేదు..

‘నిజానికి ఆ వివాదంలో భారత ఆటగాళ్ల తప్పేమీ లేదు. బంగ్లా ఆటగాళ్లే తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచిన ఆనందంలో అతి చేశారు. వారే దూషణలకు దిగారు. దాంతో మా ఆటగాళ్లు ఒకరిద్దరు వారిని నిరోధించేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. దాదాపు పది నిమిషాల పాటు కాస్త ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అయితే ఆ తర్వాత అంతా మామూలుగా మారిపోయింది. ఒకరికొకరం క్షమాపణలు చెప్పుకొని షేక్‌ హ్యాండ్స్‌ కూడా ఇచ్చుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆటగాళ్లకంటే బంగ్లా అభిమానుల వల్లే సమస్య వచ్చింది. ఫైనల్‌కు వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారితో పోలిస్తే భారత అభిమానులు కొద్ది మందే ఉన్నారు. దాంతో వారి ఆటగాళ్లను రెచ్చగొట్టి సమస్యగా మార్చారు.'అని తిలక్ తెలిపాడు.

ఓడిపోవడం నిరాశ కలిగించింది..

ఓడిపోవడం నిరాశ కలిగించింది..

టోర్నీ ఆసాంతం అదరగొట్టి ఫైనల్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని తిలక్ వర్మ తెలిపాడు. ఈ టోర్నీలో టీమిండియా యువ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ ఆడాడు. బంగ్లాదేశ్‌పై చివరి వరకూ గెలుస్తామనుకున్నామని, అయితే చివరకు ఫలితం ప్రతికూలంగా వచ్చిందన్నాడు. అయితే ఈ టోర్నీలో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువ రాకపోవడం నిరాశ కలిగించినా.. జట్టు వరుస విజయాలు ఆ ఆలోచన రాకుం చేసాయన్నాడు. ఆస్ట్రేలియాతో విఫలమైనా శ్రీలంక, ఫైనల్లో బంగ్లాపై బాగా ఆడానన్నాడు. ఫైనల్లో చాలా ఆత్మవిశ్వాసంతో ఆడానన్న తిలక్.. సెంచరీ చేస్తానని అనిపించిందని, కానీ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగక తప్పలేదన్నాడు.

 అది మరచిపోలేని క్షణం...

అది మరచిపోలేని క్షణం...

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఓడిపోతామేమో అనిపించిందని, తీవ్ర ఉత్కంఠను అనుభవించిన క్షణం అదిని తెలిపాడు. అయితే చివరకు గెలుపు అందుకోవడం తనతోపాటు అందరికీ ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చాడు. మైదానం బయట తాము క్రూగర్స్‌ పార్క్‌ సహా చాలా చోట్లు సందిర్శించినట్లు తెలిపాడు. అన్నింటికంటే బంగారం తయారీని చూడటం థ్రిల్లింగా అనిపించిందన్నాడు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన మూడు వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. యశస్వీ జైస్వాల్‌ (88), తిలక్‌ వర్మ (38), జురెల్‌ (22) మాత్రమే రాణించారు. ఆ తర్వాత ఛేదనలో బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. పర్వేజ్‌ (47), అక్బర్‌ అలీ (43 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. రవి బిష్ణోయ్‌కు 4వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్బర్‌ అలీ.. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా యశస్వీ జైస్వాల్‌ నిలిచారు.

Story first published: Thursday, February 13, 2020, 14:39 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X