న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: బూడిద పోరాటానికి సై! ఫ్రీగా ఎలా చూడాలంటే.. చానల్, టైమింగ్స్ వివరాలు ఏంటంటే..?

How To Watch Ashes 2021 For Free:Date, India Timings, Schedule, Live Streaming Details Of AUS vs ENG

సిడ్నీ: భారత్-పాకిస్థాన్ పోరు తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తి ఎదురుచూసే యాషెస్ సిరీస్‌కు రంగం సిద్దమైంది . చిరకాల ప్రత్యర్థులు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మరోసారి ఈ బూడిద పోరాటానికి సిద్దమయ్యాయి. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ బుధవారం(డిసెంబర్ 8) బ్రిస్బేన్‌లో గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. 2019 యాషెస్ సిరీస్‌ను డ్రా చేసుకొని టైటిల్ నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23‌లో భాగంగానే ఈ సిరీస్ జరగనుంది. పెర్త్ వేదికగా జనవరి 14న ఈ సిరీస్ చివరి ఐదో టెస్ట్ జరగనుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

యాషెస్ సిరీస్‌ పేరు ఎలా వచ్చిందంటే..

యాషెస్ సిరీస్‌ పేరు ఎలా వచ్చిందంటే..

1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్‌ గడ్డపై ఆసీస్‌కు ఇదే తొలి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు' అంటూ రాసుకొచ్చింది.

1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్‌ మీడియా 'యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ' వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌కి 'ది యాషెస్' అనే పేరు వచ్చింది.

ఐదో స్థానంలో ఇంగ్లండ్..

ఐదో స్థానంలో ఇంగ్లండ్..

డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్.. ఈ సిరీస్ గెలిచి మెరుగైన స్థానంలో నిలవాలనుకుంటుంది. ఇక డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి సిరీస్. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో సొంతగడ్డపై జరుగుతున్న తమ ఫస్ట్ సిరీస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే జోరూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ సొంతగడ్డపై న్యూజిలాండ్, భారత్ చేతిలో ఖంగుతిన్నది. అయితే బెన్ స్టోక్స్ జట్టులోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు ఆస్ట్రేలియా తమ రెగ్యులర్ కెప్టెన్ టీమ్ పైన్ సేవలను కోల్పోయింది. అయినప్పటీ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్‌లతో పటిష్టంగా కనబడుతోంది. పైగా టీ20 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఆ జట్టు ఉంది.

యాషెస్ 2021 షెడ్యూల్..

యాషెస్ 2021 షెడ్యూల్..

మ్యాచ్ డేట్ వేదిక
ఫస్ట్ టెస్ట్ డిసెంబర్ 8-12 ది గబ్బా, బ్రిస్బేన్
రెండో టెస్ట్ డిసెంబర్ 16-20 అడిలైడ్ ఓవర్, అడిలైడ్
మూడో టెస్ట్ డిసెంబర్ 26-30 మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్
నాలుగో టెస్ట్ జనవరి5-9 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
ఐదో టెస్ట్ జనవరి 14-18 పెర్త్ స్టేడియం, పెర్త్
 టెలికాస్ట్ వివరాలు..

టెలికాస్ట్ వివరాలు..

భారత్‌లో యాషెస్ 2021 సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెటవర్క్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ టీవీకి సంబంధించిన చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు రానున్నాయి. తెలుగు, తమిళం భాషల్లో కూడా ఈ మ్యాచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక సోనీ టీవీకే చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లీవ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్, యూకేలో బీటీ స్పోర్ట్స్, అమెరికా, కెనడాలో విల్లో టీవీ, న్యూజిలాండ్‌లో స్కై స్పోర్ట్స్, సౌతాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్ చానెల్స్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

ఫ్రీగా చూడాలంటే..

ఫ్రీగా చూడాలంటే..

ఇక ఎయిర్టెల్, జియో వినియోగదారులు ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూడవచ్చు. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీల్లో ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. సోనీలీవ్‌లో మాత్రం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, December 7, 2021, 11:56 [IST]
Other articles published on Dec 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X