న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎక్కువ మంది ప్రత్యర్థులు: రిటైర్ తర్వాత సచిన్ ఖాతాలో మరో రికార్డు

By Nageshwara Rao
Sachin Tendulkar Stands Top In One Survey
How many team-mates did Tendulkar have? And how many opponents?

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అదేంటి సచిన్ రిటైర్మెంట్‌ ప్రకటించి చాలా ఏళ్లు అవుతుంది కదా? మళ్లీ ఇప్పుడు రికార్డులేంటీ? అని అనుకుంటున్నారా? తాజాగా క్రిక్ ఇన్ఫో నిర్వహించిన ఓ అధ్యయనంలో సచిన్‌ ఒక కేటగిరిలో అగ్రస్థానంలో నిలిచాడు.

ఎందుకంత అసహనం?: 'అశ్విన్‌తో కోహ్లీ మాట్లాడి ఉండాల్సింది'ఎందుకంత అసహనం?: 'అశ్విన్‌తో కోహ్లీ మాట్లాడి ఉండాల్సింది'

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్‌లో అత్యధిక మంది ఆటగాళ్లను ప్రత్యర్థులుగా ఎదుర్కొంది కూడా సచినే కావడం విశేషం. ఇక ఎక్కువ మంది సహచరులతో ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ మూడో స్థానంలో నిలిచాడు.

సచిన్ ఖాతాలో మరో రికార్డు

సచిన్ ఖాతాలో మరో రికార్డు

సుదీర్ఘ కాలం... సుమారు 24 ఏళ్ల పాటు క్రికెట్‌కు సేవలందించిన సచిన్ దిగ్గజ క్రికెటర్లతో మాత్రమే కాదు యువ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునే అవకాశం లభించింది. సచిన్‌ అలా 110 మంది టీమ్‌ మేట్స్‌ను కలిగి ఉండి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గ్రాహం గూచ్‌ (113), ఫ్రాంక్‌ వూలే(111) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

రాహుల్ ద్రవిడ్‌కు సైతం దక్కిన చోటు

రాహుల్ ద్రవిడ్‌కు సైతం దక్కిన చోటు

మరో టీమిండియా మాజీ ఆటగాడు, అండర్‌ -19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(93) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో శివ్‌నారాయణ్‌ చంద్రపాల్‌‌(105), యూనిస్ ఖాన్(92), ఇంజిమామ్ ఉల్ హక్(91), బ్రియాన్ లారా(90), డానియేల్ వెటోరి(86)లు సైతం చోటు దక్కించుకున్నారు.

తొలి స్థానంలో సచిన్

తొలి స్థానంలో సచిన్

కాగా, ఎక్కువ మంది ప్రత్యర్థి ఆటగాళ్లను ఎదుర్కొన్న జాబితాలో సచినే తొలి స్థానంలో నిలిచాడు. తన టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 492 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను సచిన్‌ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతి స్థానంలో వరుసగా వెస్టిండీస్‌ ఆటగాడు శివ్‌నారాయణ్‌ చంద్రపాల్‌‌(426), జాక్వస్‌ కల్లిస్‌(417), ముత్తయ్య మురళీధరన్‌(415), మహేలా జయవర్దనే(404)లు ఉన్నారు.

మూడు సార్లు కోహ్లీ ఈ ఘనతను

మూడు సార్లు కోహ్లీ ఈ ఘనతను

మరోవైపు టెస్టు క్రికెట్‌‌లో ఓ బ్యాట్స్‌మన్ సరిగ్గా 200 పరుగులు చేయడం 29 సార్లు చేయడం జరిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా మూడు సార్లు ఖచ్చితంగా 200 పరుగులు నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌లలో జరిగిన టెస్టుల్లో 200 పరుగులు చేశాడు. అంతకముందు జులై 2016లో ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఇవే పరుగులు సాధించాడు.

Story first published: Thursday, September 6, 2018, 12:00 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X