న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs CSK Trolls: శాంసన్ ధాటికి ధోనీ దిమ్మతిరిగింది.. సీఎస్‌కే ఫ్యాన్స్‌కు వణుకు పుట్టింది!

Hilarious memes and funniest trolls from RR vs CSK game in IPL 2020

షార్జా: ఎవరిని తక్కువ అంచనా వేయవద్దనే విషయం రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్‌తో మరోసారి స్పష్టమైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అనామక ఆటగాళ్లతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ రఫ్ఫాడించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి బలమైన చెన్నైకి చెక్‌పెట్టింది. సమష్టి ప్రదర్శనతో ఐపీఎల్ 2020 సీజన్‌లో శుభారంభాన్ని అందుకుంది.

ఓవైపు శాంసన్(32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 74).. మరోవైపు స్మిత్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69).. ఈ ఇద్దరు చాలదన్నట్లు ఆఖర్లో ఆర్చర్(8 బంతుల్లో 4 సిక్సర్లతో 27 నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ 16 పరుగులతో విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ నెటిజన్లు రిషభ్ పంత్‌పై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే రాజస్థాన్ దెబ్బకు ధోనీ దిమ్మతిరిగిందని, చెన్నై అభిమానులకు తడిచిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

పంత్ పక్కకు తప్పుకోమ్మా..

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో భారత జట్టులో వికెట్ కీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అతని స్థానంలో రిషభ్ పంత్‌కు ఎన్ని అవకాశాలు కల్పించినా సద్వినియోగం చేసుకోలేక జట్టులో చోటునే కోల్పోయాడు. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న యువ వికెట్ కీపర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే కీపింగ్ బాధ్యతలు అందుకొని రాణించిన కేెఎల్ రాహుల్ తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. మరోవైపు రిషభ్ పంత్, సంజూశాంసన్ పోటీ పడుతున్నారు. అయితే తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బలమైన చెన్నై బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. అతని ధాటికి ఎంతో అనుభవపూర్వకమైన ధోనీ కూడా ఏం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సంజూను కొనియాడుతూ.. పంత్ ఇక రేసు నుంచి పక్కకు తప్పుకో.. సంజూ ఫామ్‌లోకి వచ్చేశాడని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ధోనీ వ్యూహం దొబ్బింది..

ఇక 217 పరుగుల భారీ టార్గెట్‌ను చేజ్ చేసే వ్యూహాన్ని రచించడంలో ధోనీ విఫలమయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌కు రాకుండా సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ క్రికెటర్లను ధోనీ ముందుకు పంపించడాడని.. వారిద్దరూ బ్యాక్ టు బ్యాక్ క్రీజు వెలుపలికి వెళ్లి సిక్స్ కొట్టబోయి స్టంపౌటయ్యారని విమర్శిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ కూడా నిరాశపరచాడని.. క్రీజులోకి వచ్చిన ధోనీ.. చివరి ఓవర్ వరకూ బ్యాట్ ఝళిపించలేదు. ఆఖరి 4 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ వరుసగా 3 సిక్సర్లు బాదినా ప్రయోజనం లేకపోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే హిట్టింగ్ ధోనీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి చేస్తే బాగుండేది కదా అని అభిప్రాయపడుతున్నారు.

దిండా క్లబ్‌లోకి చావ్లాకు స్వాగతం..

ఇక ఐపీఎల్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఏ బౌలర్‌నైనా నెటిజన్లు అశోక్ దిండా క్లబ్‌లోకి ఆహ్వానిస్తుంటారు. 2013 సీజన్‌లో అప్పటి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దిండా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఆ మ్యాచ్‌లో దిండా ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఏ బౌలర్ ఎక్కువ పరుగులిచ్చినా.. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోయినా దిండా అకాడమీ, క్లబ్‌లోకి స్వాగతం అంటూ కామెంట్ చేస్తుంటారు. తాజాగా చెన్నై స్పిన్నర్ పియూష్ చావ్లా 4 ఓవర్లు వేసి 55 పరుగులివ్వడంతో అతన్ని నెటిజన్లు దిండా క్లబ్‌లోకి స్వాగతం పలుకుతున్నారు. అలాగే 56 రన్స్ ఇచ్చిన లుంగి ఎంగిడి‌కి కూడా స్వాగతం పలుకుతూ కామెంట్ చేస్తున్నారు. చావ్లా బౌలింగ్‌ను శాంసన్ చితక్కొట్టగా.. ఎంగిడి బౌలింగ్‌ను ఆర్చర్ చీల్చిచెండాడాడు.

అంపైర్లకు వచ్చింది సావు..

ఇక షార్జా మైదానం చిన్నది కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సిక్సర్లతో చెలరేగారు. ఏ మ్యాచ్‌లోనైనా ఫోర్లు ఎక్కువగా వచ్చి సిక్సర్లు తక్కువగా వస్తే.. ఈ మ్యాచ్‌లో మాత్రం సీన్ రివర్సైంది. ఇది అంపైర్ల సావుకు వచ్చింది. ప్రతీ సిక్సర్ మైదానం బయట లేదా స్టాండ్స్‌లో పడుతుండటంతో కొత్త బంతులు ఇవ్వడానికి, తేవడానికి అంపైర్లు తెగ ఇబ్బంది పడ్డారు. కామెంట్రీలో కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

అలాగే చెన్నై అభిమానులపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. రాజస్తాన్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి చలి జ్వరం వచ్చిందని, తడిసిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

ధోనీనా మజాకానా! సిక్సర్ కొడితే మైదానం బయటే.. బంతిని ఇంటికి తీసుకెళ్లిన లక్కీ మ్యాన్ !(వీడియో)

Story first published: Wednesday, September 23, 2020, 12:06 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X