
కోహ్లీకి రూ.2 కోట్లు బొక్క..
తాజా రిటెన్షన్ రూల్స్ ప్రకారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 2 కోట్లు నష్టపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అతన్ని రూ.15 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గానే తీసుకున్నప్పటికీ ఆ జట్టు ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో నిబంధనల ప్రకారం రూ.15 కోట్లే ఇవ్వాల్సి వచ్చింది.
దాంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.17 కోట్ల వేతనం అందుకున్న విరాట్ కోహ్లీ రెండు కోట్లు తక్కువ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఐపీఎల్‌లోనే ఇప్పటి వరకు అత్యధిక వేతనం అందుకున్న కోహ్లీ.. తాజా సీజన్‌లో సహచర ఆటగాళ్ల కంటే వెనుకంజలో నిలవాల్సి వచ్చింది. కోహ్లీ తర్వాత గ్లేన్ మ్యాక్స్‌వెల్ రూ.11 కోట్లు, మహమ్మద్ సిరాజ్ రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది.

పంత్, జడేజా సైతం..
ఇక ఈ సీజన్‌లో కోహ్లీ కన్నా రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, రోహిత్ శర్మ ఎక్కువ సాలరీ అందుకోనున్నారు. రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా అంటిపెట్టుకోవడంతో రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కింది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెన్నై ఫ్రాంచైజీ.. మహేంద్ర సింగ్ ధోనీని కాదని మరి జడేజాకు వేలంలో ప్రాధాన్యత ఇచ్చింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో జడేజా రూ.7 కోట్ల వేతనం మాత్రమే అందుకోగా.. ఇప్పుడు రెట్టింపు అయ్యింది. ఇక రిషభ్ పంత్‌కు సైతం రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. పంత్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ. 8 కోట్లు అందుకున్న పంత్ జీతం డబుల్ అయింది.

రోహిత్ శర్మ సైతం..
ఇక టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కింది. ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. తమ కెప్టెన్‌కు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో రోహిత్ శర్మ రూ.14.66 కోట్ల వేతనం అందుకోగా ఈ సారి కోటిన్నర పెరిగింది. ఇక వేలంలోకి వెళ్లే ఆటగాళ్లకు వీరిని మించిన ధర దక్కనుంది.
కేఎల్ రాహుల్‌కు అత్యధికంగా రూ.20 కోట్లు లభించే అవకాశం ఉందని ఐపీఎల్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాహుల్‌తో ఆయా జట్లు లోపకారి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తుంది.

టాప్ సాలరీ లిస్ట్ ఇదే..
రోహిత్ శర్మ రూ.16 కోట్లు (ముంబై ఇండియన్స్)
రవీంద్ర జడేజా రూ. 16 కోట్లు(చెన్నై సూపర్ కింగ్స్)
రిషభ్ పంత్ రూ.16 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు( ఆర్‌సీబీ)
సంజూ శాంసన్ రూ. 14 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)
కేన్ విలియమ్సన్ రూ. 14 కోట్లు( సన్‌రైజర్స్ హైదరాబాద్)