న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఐపీఎల్లో అత్యధిక సార్లు జట్టు తరఫున టాప్ స్కోరర్లుగా నిలిచినవారు ఎవరెవరంటే?

Highest % of IPL innings as Top-scorer of the team Players, David Warner leads the list

ఐపీఎల్ 2022 సీజన్‌ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ 7వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ముద్దాడిన జట్టుగా నిలిచింది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను నిర్ణీత 20ఓవర్లలో 130పరుగులకు గుజరాత్ కట్టడి చేసింది. కాగా.. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో (30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), బౌలింగ్లో 3/17 రాణించడంతో గుజరాత్ విజయదుందుభీ మోగించింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్ ఉన్నారు. ఈ అయిదుగురు ప్లేయర్లు ప్లేఆఫ్ చేరిన జట్లలో ఉన్నవారే కావడం విశేషం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్‌లలో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచివారిని ఒకసారి పరిశీలిద్దాం. మినిమం 75ఇన్నింగ్స్ ఆడివారిని తీసుకుంటే..

సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఎన్నో మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఒంటి చేత్తో విజయాలందించాడు. అతను ఓపెనర్‌గా విఫలమైన రోజు సన్ రైజర్స్ దాదాపు ఓడిపోయేది. కేవలం బ్యాటింగ్లో వార్నర్ మీదే ఆధారపడి సన్ రైజర్స్ కొన్ని సీజన్లు నెట్టుకొచ్చింది. దాదాపు అతనే జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచేవాడు. ప్రస్తుతం అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో అత్యధిక ఇన్నింగ్స్‌లలో టాప్ స్కోరర్ నిలిచిన ప్లేయర్లలో (35.8శాతం)తో తొలిస్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో ఇండియన్ స్టార్ ప్లేయర్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (33శాతం)తో రెండో స్థానంలో, ఇంగ్లాండ్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ (32.1శాతం)తో మూడో స్థానంలో, క్రిస్ గేల్ (31.2శాతం)తో నాలుగో స్థానంలో, క్వింటన్ డికాక్ (30.4శాతం)తో అయిదో స్థానంలో కొనసాగుతున్నారు. వీళ్లందరూ ఓపెనర్లు కావడం విశేషం. ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్ శర్మ, డివిలియర్స్, శిఖర్ ధావన్ లాంటి వారు లేకపోవడం కొంత ఆశ్చర్యకరమే. కానీ జట్టు టాప్ స్కోరర్లుగా ఎక్కువ సార్లు నిలిచిన ప్లేయర్లు నిజంగా.. ఆ జట్టుకు చాలా కంట్రిబ్యూట్ చేసే ఉంటారు. ఈ విషయంలో రోహిత్, విరాట్ కోహ్లీ, ధావన్‌ల కన్నా ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అత్యుత్తమ ఆటగాడని పేర్కొనవచ్చు.

Story first published: Thursday, June 2, 2022, 7:55 [IST]
Other articles published on Jun 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X