కోహ్లీ ఇంటి అద్దె నెలకు రూ.15 లక్షలు

Posted By:
 Here is why Virat, Anushka pay Rs 15 lakh as rent for a flat in Mumbai

హైదరాబాద్: సొంతిల్లు కట్టివ్వమని బిల్డర్‌ను నమ్ముకుంటే ఇంకా చేతికప్పగించలేదు. దీంతో కోహ్లీకి అద్దె ఇల్లే గతైంది. అయినా ఆ కిరాయి ఇంటికి సైతం కోహ్లీ రూ.15లక్షలు వెచ్చించి ఉంటున్నాడట.

💑

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 11, 2018 at 5:38am PDT

గతేడాది డిసెంబర్ 11 ఇటలీలోని టస్కనీలో ఉన్న రిసార్ట్స్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన పెళ్లి జరగడానికి కొన్ని నెలల ముందు కోహ్లీ ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. దానిని తనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దమంటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఓంకార్ 1973 ప్రాజెక్టుకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. ఈ ఇంటి గురించి తెలుసుకుని 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం విరుష్క రూ.35 కోట్లు పెట్టారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

Chilling and how! 😎

A post shared by Virat Kohli (@virat.kohli) on Mar 11, 2018 at 4:22am PDT

వాళ్లు సరైన సమయానికి పూర్తి చేయకపోవడంతో అద్దింట్లో కాలం గడుపుతున్నాడు. దానికి ఖరీదు సైతం అదే స్థాయిలో ఉంది. దాదాపు 15 లక్షల వరకు చెల్లిస్తున్నాడట కెప్టెన్ కోహ్లీ.
అదే వర్లీ ప్రాంతంలో తాత్కాలికంగా మరో ఫ్లాట్‌ను విరుష్క తీసుకున్నారు. కేవలం 24 నెలల కోసమే రహేజా లెజెండ్స్ అపార్ట్‌మెంట్ 40వ అంతస్తులో ఓ ఫ్లాట్ తీసుకున్నారు.

2675 చదరపు అడుగులు ఉన్న ఈ ఫ్లాట్ కోసం నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లించనున్నాడు విరాట్ కోహ్లి. దీనికోసం ఇప్పటికే రూ.కోటిన్నర డిపాజిట్ చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్ కోసం రూ.1.01 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ముంబైలో వర్లీ ఏరియాకు చాలా డిమాండ్. సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు ఇక్కడ ఉంటారు. దీంతో ఇక్కడ ఇళ్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి.

Story first published: Monday, March 12, 2018, 17:18 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి