న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ ఫిట్‌నెస్‌కు..నీ ఎనర్జీకి..నీ కమిట్‌మెంట్‌కు.. టేక్ ఎ బోవ్: ధోనీ ఫ్యాన్స్ ఫిదా

He never get old in cricket, twitter reactions after Dhoni jumps in crease

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. అప్పడే డజను మ్యాచులు పూర్తయ్యాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన జట్లు అంచనాలకు అనుగుణంగానే రాణిస్తున్నాయి. అన్నింటికీ మించి విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలను అందుకుంటోంది. ఈ సాలా కప్ నమ్‌దే అనిపించేలా ఉంది ఆ జట్టు ఆటతీరు. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో పైకెక్కి కూర్చుంది. గత ఏడాది ప్రదర్శనకు భిన్నంగా చెన్నై సూపర్ కింగ్స్ తన సత్తా చాటుతోంది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌పై.. రాయల్‌గా

సంజు శాంసన్ కేప్టెన్సీగా వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని అందుకున్న తరువాత.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. నాలుగు పాయింట్లతో 1.194 నెట్ రన్‌రేట్‌ను అందుకుంది. ఈ స్థాయి రన్‌రేట్ మరే ఇతర జట్టుకు లేదు. అన్నీ జీరోల్లోనే ఉన్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 45 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం చెన్నైకి లాభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్‌ను ఛేదించడానికి బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్లను 143 పరుగులే చేయగలిగింది.

నిరాశ పరిచినా..

ఈ మ్యాచ్‌లో ధోనీ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. 17 బంతులను ఎదుర్కొన్న అతను 18 పరుగులే చేయగలిగాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. కొత్త బౌలర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటం వల్ల అతని వంతు రాలేదు. మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడం వల్ల ధోనీ బ్యాటింగ్‌ను చూడొచ్చని భావించినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. ఎలాంటి మెరుపులు మెరిపించలేదతను.

ఫిట్‌నెస్ లెవెల్స్‌కు ఫిదా

ధోనీ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో రనౌట్ నుంచి తప్పించుకోవడానికి అతను క్రీజ్‌లోకి జంప్ చేసిన విధానం అభిమానులను కట్టి పడేసింది. రాహుల్ తెవాతియా సంధించిన 14వ ఓవర్ రెండోబంతిని కవర్స్ వైపు ఆడిన ధోనీ.. రన్ తీయడానికి ప్రయత్నించాడు. అక్కడే సంజు శాంసన్ మెరుపు వేగంతో దాన్ని అడ్డుకుని వికెట్ కీపర్ వైపు విసిరేశాడు. దాన్ని గమనించిన ధోనీ.. క్రీజ్‌లోకి వచ్చిన తీరు అతని ఫిట్‌నెస్ లెవెల్స్‌కు ప్రతీకగా నిలిచింది. బంతి కంటే వేగంగా వెనక్కి మళ్లాడతను. చిరుతలా క్రీజ్‌లోకి జంప్ చేశాడు. స్ప్లిట్ సెకెండ్‌లో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ధోనీ స్పందించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సలాం కొడుతున్నారు.

Story first published: Tuesday, April 20, 2021, 8:17 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X