న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడు: కుల్దీప్‌కు బాసటగా సచిన్

By Nageshwara Rao
 He is ready for Test cricket: Sachin Tendulkar backs Kuldeep Yadav

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. జోరూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టుని కుల్దీప్ కట్టడి చేయగలడనే నమ్మకముందని సచిన్ అన్నారు.

ఇంగ్లాండ్‌తో మొదటి మూడు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన 18 మంది భారత జట్టులో కుల్దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1 నుంచి బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది.

తొలి టెస్టు నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టులకు కుల్దీప్ సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నా. ఎలాంటి సందేహాం లేదు. కుల్దీప్ ఈ పర్యటనలో తప్పక రాణిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం" అని అన్నారు.

"ఈ వేసవి సమయంలో ఇంగ్లాండ్ వెచ్చగా ఉంటుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలం. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ పర్యటనలో మన స్పిన్నర్లు ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగలరు. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లు బ్యాట్‌తో రాణించగలరు, అలాగే బ్యాట్స్ మెన్ సైతం బౌలింగ్ చేయగలరు" అని సచిన్ తెలిపారు.

"బ్యాటింగ్‌లో కీపర్లు సహకారం కూడా ఎంతో ముఖ్యం. అశ్విన్, జడేజాలు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలరు. హార్దిక్ పాండ్యా రూపంలో ఆల్ రౌండర్ ఉన్నాడు. హార్దిక్ ఇటీవలే తన కెరీర్‌ను ఆరంభించాడు. దీనిని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే నేను పేపర్ మీద చూస్తున్నానో... జట్టులో సమతుల్యాన్ని తీసుకొస్తుంది" అని సచిన్ పేర్కొన్నారు.

"ఇక్కడ, నేను ఒక ఉదహరణకు చెప్పాలి. పాకిస్థాన్‌తో ఓ సిరిస్ ఆడేందుకు గాను టొరెంటో వెళ్లాం. భారత టాప్ త్రీ బౌలర్లు జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే ఈ పర్యటనకు రాలేదు. బౌలర్లు అందుబాటులో లేనంత మాత్రాన, సిరిస్‌లో మనం ఓడిపోతామని భావించకూడదు" అని సచిన్ వెల్లడించారు.

అయితే, ఇక్కడ తుది జట్టు సమతుల్యంతో ఉండటంతో, ఈ పర్యటనలో పాక్‌పై 4-1తేడాతో విజయం సాధించామని సచిన్ పేర్కొన్నారు. క్రీడల్లో ఆటగాళ్లు గాయాలు పాలవుతుండటం సహజమని, దీంతో పూర్తి జట్టు ఎప్పుడూ అందుబాటులో ఉండదని సచిన్ పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మొదటి రెండు వన్డేల్లో కుల్దీప్ 9 వికెట్లు తీసి తన కెరీర్‌లో అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో తన కెరీర్ బెస్ట్ (6-25) గణాంకాలను నమోదు చేసి, ఇంగ్లీషు గడ్డపై అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, July 23, 2018, 15:53 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X