|
టాప్‌లో ఉండాలంటే కష్టపడాలి..
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం పంత్ ఔటైన వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే కెరీర్ కొనసాగడం కష్టమని హెచ్చరించాడు. ఓపెనర్‌గా రిషభ్ పంత్ పాత్రను భోగ్లే ప్రశ్నించాడు. టీ20 క్రికెట్లో.. ముఖ్యంగా ఓపెనర్‌గా పంత్ ఎలాంటి ఆటగాడు కావాలని అనుకుంటున్నాడో తనకు అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. రిషభ్ టాప్‌లో నిలవాలంటే అతను మరింత శ్రమించి, నైపుణ్యాలను సాధించాలని హర్షా భోగ్లే హితవు పలికాడు. ఈ ట్వీట్ వైలర్ కాగా..నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

టీ20లకు పంత్ సెట్టవ్వడు..
టీ20 ఫార్మాట్‌కు రిషభ్ పంత్ అన్‌ఫిట్ అని తెలిసినా బీసీసీఐ వరుస అవకాశాలు కల్పిస్తుందని ఓ నెటిజన్ విమర్శించాడు. పంత్‌లో టెంపర్‌మెంట్ గానీ.. పవర్ ప్లేలో దూకుడుగా ఆడే తత్వం గానీ లేదన్నాడు. పేస్ కంటే స్పిన్‌ను అతను సమర్థంగా ఎదుర్కోవచ్చని.. బ్రిస్బేన్‌లో అతడి ఇన్నింగ్స్‌ను మర్చిపోలేమని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే తీవ్ర అన్యాయానికి గురైన ఆటగాడు సంజూ శాంసనే అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 2014లోనే అతను భారత జట్టుకు ఎంపికైనప్పటికీ.. మేనేజ్మెంట్ అతని పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాడు.

సంజూకు చాన్సివ్వాలంటూ..
న్యూజిలాండ్‌తో మూడో టీ20లోనూ పంత్ విఫలమయ్యాక.. ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా అతడి పేరు కనిపించింది. దీన్ని బట్టి పంత్ ఆటతీరు పట్ల నెటిజన్లు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొందరు నెటిజన్లు రిటైరై వేరే దేశం తరఫున ఆడాలని సంజూ శాంసన్‌కు సూచిస్తున్నారు. రిషభ్ పంత్‌కు ఇచ్చిన అవకాశాలు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే స్టార్ ప్లేయర్‌గా ఎదిగేవాడని అభిప్రాయపడుతున్నారు. కనీసం వన్డే సిరీస్‌లోనైనా పంత్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇక వన్డే సిరీస్..
న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరి టీ20 వర్షం కారణంగా టై అయ్యింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హార్దిక్ సేన 1-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చివరి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా..డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ టై అయ్యింది. టీమిండియా శుక్రవారం(నవంబర్ 25) నుంచి శిఖర్ ధావన్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.