న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: హర్షా భోగ్లే బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!

Harsha Bhogle picks his Indian T20 XI of IPL 2022: No chance For Virat Kohli and Rohit Sharma

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే షాకిచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ది బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్ ఎంపిక చేసిన హర్షా భోగ్లే.. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లకే చోటివ్వలేదు. కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోలేదు. బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపని జస్‌ప్రీత్ బుమ్రాకు చోటిచ్చిన హర్షా.. సత్తా చాటిన మహమ్మద్ షమీతో పాటు ఉమేశ్ యాదవ్‌లను ఎంపిక చేయలేదు.

ఓపెనర్లుగా రాహుల్, త్రిపాఠి

ఓపెనర్లుగా రాహుల్, త్రిపాఠి

ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠిలను తన బెస్ట్ టీమ్ ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్‌ల్లో 413 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

 మిడిలార్డర్‌లో సంజూ, సూర్య..

మిడిలార్డర్‌లో సంజూ, సూర్య..

ఇక ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసిన హర్షా భోగ్లే.. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్నాడు. ఆరో స్థానంలో గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్.. 29.60 యావరేజ్‌తో 444 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 8 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. 14 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా 4 హాఫ్ సెంచరీలతో 453 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసాడు. దాంతోనే ఈ నలుగురిని హర్షా మిడిలార్డర్‌లో ఎంపిక చేశాడు.

 కీపర్‌గా దినేశ్ కార్తీక్..

కీపర్‌గా దినేశ్ కార్తీక్..

ఇక వికెట్ కీపర్‌గా ఈ సీజన్‌లో నయా హిట్టర్‌గా అందరిచేత ప్రశంసలు అందుకున్న దినేశ్ కార్తీక్‌ను కీపర్‌గా ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున 16 మ్యాచ్‌లు ఆడిన దినేశ్ కార్తీక్.. 55 సగటుతో 330 పరుగులు చేశాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో మలుపు తిప్పాడు. ఆర్‌సీబీ ఎలిమినేటర్ వరకు రావడానికి ప్రధాన కారణం డీకే. అందుకే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సాహాలను కాదని హర్షా భోగ్లే దినేశ్ కార్తీక్‌ను తీసుకున్నాడు. ఈ సీజన్‌లో బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన రవి అశ్విన్‌ను ఏడో స్థానంలో ఎంపిక చేశాడు. అశ్విన్ 185 పరుగులతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు.

బౌలింగ్ సారథిగా బుమ్రా..

బౌలింగ్ సారథిగా బుమ్రా..

ఈ సీజన్‌లో అంతంత మాత్రమే రాణించిన జస్‌ప్రీత్ బుమ్రాను హర్షాభోగ్లే ఎంపిక చేశాడు. అతనికి తోడుగా యువ పేసర్, లక్నో సెన్సేషన్ మోహ్‌సిన్ ఖాన్‌ను తీసుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్‌కు కూడా అవకాశం ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. 14 మ్యాచ్‌ల్లో బుమ్రా 15 వికెట్లు తీయగా.. అరంగేట్ర బౌలర్ మోహ్‌సీన్ ఖాన్ 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో సత్తా చాటాడు. 5.97 ఎకానమీతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. 15 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ పటేల్ 19 వికెట్లు పడగొట్టాడు. యూజీ చాహల్ 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, May 28, 2022, 18:37 [IST]
Other articles published on May 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X