న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says we were poor with the ball and conceded 20-25 runs After NZ beat IND in 1st T20I

రాంచీ: పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడంతో పాటు బౌలింగ్‌లో అదనంగా 20-25 పరుగులివ్వడం న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యామని చెప్పాడు.

పరిస్థితులకు తగ్గట్లు న్యూజిలాండ్ తమ కంటే మెరుగ్గా రాణించడంతో విజయాన్నందుకుందని చెప్పాడు. బ్యాటింగ్‌లో కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం కూడా దెబ్బతీసిందన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మరో ప్లేయర్ మెరుగైన ప్రదర్శన చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.

 పిచ్ షాకిచ్చింది..

పిచ్ షాకిచ్చింది..

'పిచ్ ఇలా ఉంటుందని ఎవరం ఊహించలేకపోయాం. వికెట్ స్పందించిన తీరు చూసి ఇరు జట్లు ఆశ్చర్యానికి గురయ్యాయి. కానీ న్యూజిలాండ్ పరిస్థితులను అందిపుచ్చుకొని మెరుగైన ప్రదర్శన చేసి విజయాన్నందుకుంది. వాస్తవానికి ఈ వికెట్‌పై పాత బంతి కంటే కొత్త బంతే ఎక్కువగా టర్న్ అయ్యింది. అనూహ్య బౌన్స్ కూడా షాక్‌కు గురిచేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైనా మేం ఓ దశలో పుంజుకున్నాం.

25 పరుగులు ఎక్కువగా ఇచ్చి..

25 పరుగులు ఎక్కువగా ఇచ్చి..

సూర్య, నేను కీలక భాగస్వామ్యంతో జట్టును రేసులోకి తెచ్చాం. ఈ వికెట్‌పై 177 పరుగులు చాలా ఎక్కువ. మేం బౌలింగ్‌లో 20-25 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. ఇది యువ జట్టు.. మేం మా తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అతనిలో మరొకరు బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

చెలరేగిన మిచెల్..

చెలరేగిన మిచెల్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), డారిల్ మిచెల్(30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.

 సుందర్, సూర్య మెరిసినా..

సుందర్, సూర్య మెరిసినా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓటమిపాలైంది. వాషింగ్టన్ సుందర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47)పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్‌వెల్, సాంట్నర్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. ఇష్ సోదీ, జకోబ్ డఫ్ఫీ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన ఆఖరి ఓవర్‌లో 27 పరుగులివ్వడం టీమిండియా పతనాన్ని శాసించింది.

Story first published: Friday, January 27, 2023, 23:19 [IST]
Other articles published on Jan 27, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X