న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బేసిక్ తప్పిదాలతో ఓటమి పాలయ్యాం.. ఏ ఫార్మాట్‌లోనైనా నోబాల్ క్రైమ్: హార్దిక్ పాండ్యా

Hardik Pandya says In bowling

పుణే: బేసిక్ తప్పిదాలతోనే శ్రీలంకతో రెండో టీ20లో ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. క్రికెట్‌లో బ్యాడ్ డే, గుడ్ డే ఉంటాయని, కానీ బెసిక్స్ మరిచి ఆడకూడదని తెలిపాడు. గురువారం ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఏ ఫార్మాట్‌లోనైనా నో బాల్ నేరమన్నాడు. ఈ ఓటమికి అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే కారణమని చెప్పడం లేదని, ఇలాంటి బేసిక్ తప్పిదాలు చేయవద్దని చెబతున్నానని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పవర్ ప్లే తమ కొంపముంచిందన్నాడు.

కొంపముంచిన పవర్ ప్లే..

కొంపముంచిన పవర్ ప్లే..

‘బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ పవర్ ప్లే మా కొంపముంచింది. మేం బేసిక్ తప్పిదాలు చేశాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి తప్పిదాలు అస్సలు చేయకూడదు. మంచి, చెడు రోజు ఉండటం సాధారణమే అయినా బెసిక్స్ మరిచిపోకూడదు. ఈ పరిస్థితులు అర్ష్‌దీప్‌కు చాలా కఠినంగా ఉంటాయి. అతన్ని నిందించడం లేదు. కానీ అతను గతంలో కూడా ఇలానే నో బాల్స్ వేసాడు. ఈ ఓటమిని అతను జీర్ణించుకోలేడు. ఏ ఫార్మాట్‌లోనైనా నోబాల్స్ వేయడం నేరం అనే విషయం అందరికి తెలుసు.

అందుకే రాహుల్ మూడో స్థానంలో..

అందుకే రాహుల్ మూడో స్థానంలో..

జట్టులోకి వచ్చే కొత్త ప్లేయర్‌కు సౌకర్యంగా ఆడే అవకాశం ఇవ్వడం జట్టు‌ ఆనవాయితీ. రాహుల్ త్రిపాఠి మూడో నంబర్‌లో అద్భుతంగా ఆడగలడు. అందుకే అతన్ని ఆ స్థానంలో బరిలోకి దింపాం. నాలుగో స్థానంలో సూర్య తనదైన శైలిలో చెలరేగాడు'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు.

కొంపముంచిన నోబాల్స్..

కొంపముంచిన నోబాల్స్..

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51)ల పోరాటం వృథా అయ్యింది. చివర్లో శివమ్ మావి(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) రాణించాడు. ఇక భారత బౌలర్లు 7 నోబాల్స్ వేయడం ఓటమిని శాసించింది. ఈ నో బాల్స్ ద్వారా శ్రీలంక అదనంగా 36 పరుగులు చేసింది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు. ఈ అనవసర పరుగులే టీమిండియా ఓటమిని శాసించాయి.

Story first published: Friday, January 6, 2023, 6:55 [IST]
Other articles published on Jan 6, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X