న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు: హార్దిక్ పాండ్యా

Hardik Pandya reveals the reason

న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ చేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని లంక సారథి డసన్ షనక తెలిపాడు. ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున శివం మావి, శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. రజత్ పటీదార్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించినా.. శుభ్‌మన్‌ గిల్‌కే టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. ఇక స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. అతని స్థానంలో శివమ్ మావి జట్టులోకి వచ్చాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతోనే అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

'ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. జట్టుకు సారథ్యం వహించడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. చేజింగ్ గ్రౌండ్ అయినప్పటికీ మేం కఠిన పరిస్థితుల్లో మమ్మల్ని మేం నిరూపించుకోవాలనుకుంటున్నాం. ఫిట్‌నెస్ సమస్యలతో అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. శుభ్‌మన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేస్తున్నారు'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

మంచు ప్రభావం ఉంటుందనే ముందుగా బౌలింగ్ తీసుకున్నామని డసన్ షనక తెలిపాడు. టీ20 ప్రపంచకప్ తప్పా గతేడాది టీ20ల్లో అద్భుతంగా రాణించామని అదే జోరును ఈ ఏడాది కూడా కొనసాగించాలనుకుంటున్నామన్నాడు. బ్యాటింగ్ లైనప్‌ను మార్చలేదని చెప్పిన షనక.. బౌలింగ్ విభాగం మార్చమని చెప్పాడు.

తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుషంక

Story first published: Tuesday, January 3, 2023, 18:59 [IST]
Other articles published on Jan 3, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X