న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భయ్యా.. నువ్వు గోల్డ్ ఎహె: హార్దిక్ పాండ్యా

Hardik Pandya reacts as brother Krunal shares clip of their first TV interview

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్ పాండ్యాను ట్విటర్ వేదికగా కొనియాడాడు. బంగారం లాంటి వీడియోను షేర్ చేసావ్ బ్రో అంటూ ప్రశంసించాడు. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ ఇద్దరు అన్న దమ్ములు కలిసి స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఒకనాటి ఇంటర్వ్యూను కృనాల్‌ పాండ్యా ట్వీటర్‌ వేదికగా పంచుకున్నాడు.

బరోడా తరఫున రంజీ ట్రోఫీ ఆడిన తొలిసారి స్థానిక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూని పేర్కొన్న కృనాల్.. తమ క్రికెట్ కెరీర్‌లో కూడా ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అని తెలిపాడు.
దీనిపై తనదైన శైలిలో స్పందించిన హార్దిక్‌'ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే గోల్డ్‌ బ్రో' అని కామెంట్‌ చేశాడు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు రావడం చాలా అరుదు. కాగా, యువ క్రికెటర్లగా ఉన‍్నప్పుడు వారిచ్చిన ఇంటర్వ్యూను చూస్తే 'యంగ్‌ కిడ్స్‌ విత్‌ బిగ్‌ డ్రీమ్స్‌' అనక తప్పదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇక భారత క్రికెట్‌ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌‌గా హార్దిక్‌ పాండ్యా కొనసాగుతుండగా, అతని సోదరుడు కృనాల్‌ పాండ్యా మాత్రం అడపా దడపా అవకాశాలకే పరిమితం అయ్యాడు. హార్దిక్‌ పాండ్యా తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగితే, కృనాల్‌ మాత్రం ఇంకా అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాడు. గతేడాది వెన్నుగాయానికి శస్త్ర చికిత్స తీసుకుని సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న హార్దిక్‌.. ఇక రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దేశవాళీ లీగ్‌లో హార్దిక్‌ తన చాటుకుని పునరాగమనానికి సిద్ధమయ్యాడు.

కృనాల్‌ మాత్రం ఒక పెద్ద సక్సెస్‌ కోసం పరితపిస్తూ టీ20లకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 11 టెస్ట్‌లు, 54 వన్డేలు, 40 టీ20లు ఆడిన హార్దిక్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కృనాల్ 121 పరుగులు చేశాడు.

Story first published: Monday, July 6, 2020, 14:57 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X