న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాండ్యా సహజ ప్రతిభావంతుడే కాదు మ్యాచ్ విన్నర్ కూడా'

Hardik Pandya a natural talent and a match-winner: Ravi Shastri

హైదరాబాద్: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యe సహజ ప్రతిభావంతుడని హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరిస్‌ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకుని కివీస్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ "జట్టులో హార్దిక్‌ పాండ్యా పునరాగమనం చాలా బాగుంది. అతడు సహజ ప్రతిభావంతుడు. మ్యాచ్‌ విన్నర్‌. బ్యాట్‌తో అతడేం చేయగలడో ఈ రోజు చూపించాడు. హార్ధిక్ పాండ్యా చేసిన 20-30 పరుగులు ఎంతో కీలకమయ్యాయి" అని అన్నాడు.

షమిపై రవిశాస్త్రి ప్రశంసలు

షమిపై రవిశాస్త్రి ప్రశంసలు

ఇక, న్యూజిలాండ్ పర్యటనలో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న పేసర్‌ మహ్మద్‌ షమిపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. గాయంతో దూరమై తిరిగి జట్టులోకి వచ్చిన అతడు ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. చివరి వన్డేలో 18/4తో కష్టాల్లో పడ్డ భారత జట్టుని రాయుడు, విజయ్‌, పాండ్యా, జాదవ్‌ గట్టెక్కించారని శాస్త్రి తెలిపాడు.

న్యూజిలాండ్ గడ్డపై సిరిస్ విజయం మరుపురానిది: రోహిత్ శర్మ

కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళలపై పాండ్యా అనుచిత వ్యాఖ్యలు

కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళలపై పాండ్యా అనుచిత వ్యాఖ్యలు

కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యాను బీసీసీఐ కొన్నాళ్లపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత నిషేధం ఎత్తివేయడంతో న్యూజిలాండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌పై చివరి వన్డేలో 22 బంతుల్లో 45 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐదో వన్డేలో ఐదు సిక్సర్లు బాదిన పాండ్యా

ఐదో వన్డేలో ఐదు సిక్సర్లు బాదిన పాండ్యా

ఈ మ్యాచ్‌లో పాండ్యా ఐదు సిక్సర్లు బాదాడు. ఆస్టల్‌ వేసిన ఓవర్లో రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదిన పాండ్యా.. ఆఫ్‌ స్టంప్‌ మీద పడిన ఫుల్‌ బంతిని డీప్‌ కవర్స్‌లో సిక్స్‌ కొట్టేశాడు. మూడో సిక్స్‌ అయితే కళ్లు చెదిరిపోయింది. మిడిల్‌ వికెట్‌ మీద పడిన ఈ బంతిని క్రీజులో ఎక్కువ కదలకుండానే భుజ బలాన్ని ఉపయోగించి స్టాండ్స్‌లోకి పంపాడు.

Story first published: Monday, February 4, 2019, 12:08 [IST]
Other articles published on Feb 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X