న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా సోదరుల ఇంట విషాదం.. టోర్నీ మధ్యలోంచి ఇంటికెళ్లిన కృనాల్!!

Hardik Pandya and Krunal Pandyas father passes away

రాజ్‌కోట్‌: టీమిండియా పాండ్యా సోదరుల ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. హార్దిక్ ఇంటివద్దే ఉండగా.. కృనాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన కృనాల్ ఇంటికి వెళ్లినట్లు బరోడా క్రికెట్ అసోషియేషన్ సభ్యుడు ఓ ప్రకటనలో తెలిపారు.

రెండోరోజు కూడా బౌలింగ్ చేయని సైనీ.. గాయం పెద్దదేనా?రెండోరోజు కూడా బౌలింగ్ చేయని సైనీ.. గాయం పెద్దదేనా?

తండ్రి అంటే హార్దిక్‌కి చాలా ఇష్టం:

తండ్రి అంటే హార్దిక్‌కి చాలా ఇష్టం:

ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హార్ధిక్ ఆడ‌డం లేదు. తండ్రి హిమాన్షు పాండ్యా అంటే హార్దిక్‌కి చాలా ఇష్టం. కృనాల్ కంటే ముందు టీమిండియాకి ఆడిన హార్దిక్.. తన సంపాదనతో హిమాన్షు పాండ్యాకి ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఓ విదేశీ టూర్‌లో ఉన్న హార్దిక్.. కారుని బుక్ చేసి షోరూమ్‌కి తండ్రిని తీసుకెళ్లాల్సిందిగా కృనాల్‌‌ని కోరాడు. అక్కడ హిమాన్షుకి సోదరులిద్దరూ కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంటనే:

తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంటనే:

తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలిసిన కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాడు. ఈ విష‌యాన్ని జ‌ట్టు యాజ‌మాన్యం పేర్కొన్న‌ది. కృనాల్ నేతృత్వంలోని బ‌రోడా జ‌ట్టు.. ఇప్ప‌టివ‌ర‌కు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌ల‌ను గెలిచింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని బయో-సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహిస్తుండగా.. ఇంటికి వెళ్లడం ద్వారా కృనాల్ ఆ బబుల్‌ నుంచి వెలుపలికి వచ్చేశాడు. మళ్లీ బబుల్‌లోకి వెళ్లాలంటే.. క్వారంటైన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.

అడపాదడపా అవకాశాలకే కృనాల్‌:

అడపాదడపా అవకాశాలకే కృనాల్‌:

భారత క్రికెట్‌ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌‌గా హార్దిక్‌ పాండ్యా కొనసాగుతుండగా.. కృనాల్‌ పాండ్యా మాత్రం అడపాదడపా అవకాశాలకే పరిమితం అయ్యాడు. హార్దిక్‌ తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగితే.. కృనాల్‌ మాత్రం ఇంకా అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాడు. కృనాల్‌ ఒక పెద్ద సక్సెస్‌ కోసం పరితపిస్తూ టీ20లకే పరిమితమయ్యాడు. 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కృనాల్ 121 పరుగులు చేశాడు.

2016లో అరంగేట్రం:

2016లో అరంగేట్రం:

గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 57 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 1167, పొట్టి క్రికెట్‌లో 388 పరుగులు చేశాడు. 2019 సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. గత ఏడాది నటాషాని హార్దిక్ వివాహం చేసుకోగా.. వారికి అగస్త్య పుట్టిన విషయం తెలిసిందే.

రెండోరోజు కూడా బౌలింగ్ చేయని సైనీ.. గాయం పెద్దదేనా?

Story first published: Saturday, January 16, 2021, 11:04 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X