న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా రగిలింది మోదీజీ: విరాట్, రోహిత్

Hardik Pandya and KL Rahul and Jasprit Bumrah support PM Modis 9 PM, 9 minutes appeal

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా నేటి రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లను ఆఫ్‌ చేసి దీపాలు, కొవ్వొత్తులు లేదా మొబైల్‌ ఫ్లాష్‌లైట్స్‌ను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు భారత క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. గతంలో ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించిన భారత జట్టు.. మరోసారి తమ సంఘీభావాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్నవేళ‌.. మ‌న ఐక్య‌త చూపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ట్విటర్ వేదికగా అభిమానులకు సూచించారు. ప్ర‌ధాని మోదీ పిలుపు మేర‌కు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు లైట్ల‌ను ఆర్పివేసి,అందుబాటులో ఉన్న వ‌స్తువుల‌తో వెలుగులు నింపుదామ‌ని పిలుపునిచ్చారు. హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలు సైతం తమ మద్దతు ప్రకటించారు.

వైద్య సిబ్బందికి భరోసానిద్దాం..

‘స్టేడియం శక్తి మొత్తం అభిమానుల్లో ఉంటే.. భారత దేశ శక్తి ప్రజల్లో ఉంటుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలకు మనమంతా ఏకతాటిపై నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. మన వైద్య సిబ్బందికి వెన్నంటే ఉన్నామనే భరోసానిద్దాం. టీమ్‌ఇండియా రగిలింది మోదీజీ'అని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేయగా.. ‘కరోనాపై మ్యాచ్‌ గెలవడం మీదే మన జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల కార్యక్రమంలో పాలుపంచుకొని మీ సంఘీభావాన్ని తెలపండి.'అని రోహిత్‌శర్మ ట్వీట్ చేశాడు.

కొవ్వొత్తులతో వెలుగులు విరజిమ్ముదాం..

'ఈ చీకట్లో మనకు దారి చూపిస్తూ ముందుండి పోరాడుతున్న ధీరులపైకి.. మనం కొవ్వొత్తులు, ఫ్లాష్‌లైట్లతో వెలుగులు విరజిమ్ముదాం. భారత ప్రజల బలమైన స్ఫూర్తిని మరోసారి రగిలిద్దాం. మా డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మీ ఇంటి గుమ్మాల వరకు లక్ష్మణ రేఖలు గీసి ఉన్నాయి. మీవెంటే మేమున్నాం.. నరేంద్రమోదీజీ.' అంటూ టీమిండియా స్టార్ ఆల్ ‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా ట్వీట్ చేశాడు.

మనసత్తా చాటుదాం..

‘ఏప్రిల్‌ 5న 9 గంటలకు 9 నిమిషాలు. కొవ్వొత్తులు, దీపాలతో సిద్ధంగా ఉండండి. మీ ఐక్యత ఎలా ఉంటుందో చూపించండి. 130 కోట్ల మంది హృదయాల స్ఫూర్తిని రగిలించి.. ఈ మహమ్మారిని మన మైదానం నుంచి తరిమేయండి. కలిసికట్టుగా ఈ మహమ్మారిని మనం జయించగలం.' అని ట్విటర్ వేదికగా కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు.

ఇక స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. 'టీమిండియా.. మనమంతా ఈ వైరస్‌ను స్టేడియం బయటకు దంచికొడదాం. ఏప్రిల్‌ 5 రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు. మోదీజీకి మీ మద్దతు తెలపండి.' అని సూచించాడు.

Story first published: Sunday, April 5, 2020, 15:25 [IST]
Other articles published on Apr 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X