న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ బర్త్‌డే స్పెషల్: సూపర్‌స్టార్‌ని విష్ చేస్తున్నా... 6 6 6 6 6 6 అంటూ ఐసీసీ ట్వీట్

#HappyBirthdayYuvrajSingh : Yuvraj Singh Celebrates His 38th Birthday || Oneindia Telugu
Happy Birthday Yuvraj Singh: Sachin Tendulkar, Virat Kohli wish Indias twin World Cup hero

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురువారం 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20, వన్డే వరల్డ్ కప్) అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్‌కు సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని యువరాజ్ కల్పించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా... ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ పుట్టినరోజు సందర్భంగా మీకోసం....

<strong>PHOTOS: పోలింగ్ స్టేషన్‌లో ధోని, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!</strong>PHOTOS: పోలింగ్ స్టేషన్‌లో ధోని, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

2011 వన్డే వరల్డ్‌కప్

సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ని ప్రదర్శించాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 362 పరుగులు(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు) చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా మొత్తం 9 మ్యాచ్‌లాడిన యువరాజ్ 90 యావరేజితో పరుగులు సాధించడం విశేషం. అంతేకాదు ఈ టోర్నీలో యువరాజ్ 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

2007 టీ20 వరల్డ్‌కప్

యువీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఆరు సిక్సర్లు. ఈ ఆరు సిక్సర్లను ఈ టీ20 వరల్డ్ కప్‌లోనే యువీ సాధించాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని అవాక్కయేలా చేశాడు. కేవలం 12 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

మూడు వరల్డ్‌కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడిగా

ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ కప్‌ల్లో సభ్యుడిగా ఉన్న ఏకైక భారత ఆటగాడు యువరాజ్ సింగే కావడం విశేషం. 2000లో ఐసీసీ నిర్వహించిన అండర్-19 వరల్డ్ కప్‌ విజేతగా భారత్ నిలవడంలో యువరాజ్ కీలకాపత్ర పోషించాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అంచనాలకు మించి భారత అభిమానుల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లలో యువీ పాత్ర

భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లలో యువరాజ్ తన బ్యాట్ తో ముఖ్య పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ పాత్ర అపూర్వమైనది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంతో యువరాజ్ మెరిశాడు.

నాట్ వెస్ట్ సిరిస్ ఫైనల్‌లో

లార్డ్స్ వేదికగా జరిగిన నాట్ వెస్ట్ సిరిస్ ఫైనల్‌లో యువరాజ్ ఆట భారత క్రికెట్‌ను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లింది. 2003 ప్రపంచకప్‌లో పాక్‌పై విజయంలో యువరాజ్ ఫినిషింగ్ టచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా చెబుతూ పోతే.. టీమిండియా విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించిన మ్యాచ్ లు, ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి.

క్యాన్సర్‌ను జయించిన తీరు

క్యాన్సర్‌ను జయించిన తీరు

ఏప్రిల్ 2, 2011న యువీకి క్యాన్సర్ ఉందని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్న యువరాజ్ సింగ్‌కు మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. ఈ విధంగా యువీ క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్‌ను జయించిన అనంతరం క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని యువరాజ్ అనుకున్నాడు. ఇందులో భాగంగా ‘యువీకెన్' పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి.. దాని ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు.

Story first published: Thursday, December 12, 2019, 16:55 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X