అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమైన మిథాలీ, ఆసీస్ చేతిలో భారత్ పని ఖాళీ

Posted By:
Groggy start for India as plans go awry

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళలతో తలపడిన వన్డే సిరీస్‌లో భారత మహిళలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌లో భారత్‌ తడబడింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో తొలి మ్యాచ్ పగ్గాలు హర్మన్‌ప్రీత్ కౌర్ చేపట్టింది. అయితే మిథాలీ లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.

తొలుత టాస్ బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ జట్టు ఆస్ట్రేలియాకు బౌలింగ్ అప్పగించింది. మొదటి నుంచి ఆచితూచి ఆడిన భారత ఓపెనర్లు పూనమ్ రౌత్ (37), స్మృతి మందన (12) తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్మృతి మందన ఔటైన తరవాత మిగిలిన బ్యాట్స్ ఉమెన్ వరస కట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి భారత టాపార్డర్ కుప్పకూలింది. అయితే వికెట్ కీపర్ సుష్మా వర్మ (41), టెయిలెండర్ పూజా వస్త్రాకర్ (51) పోరాడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయింది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ జొనాసెస్‌ (4/30), లెగ్‌స్పిన్నర్‌ అమంద జేడ్‌ వెల్లింగ్టన్‌ (3/24) విజృంభించడంతో 50 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచే దూకుడుగా ఆడిం%5Etfw">#INDvAUS pic.twitter.com/D4rEi6yLiu— BCCI Women (@BCCIWomen) March 12, 2018

భారత బౌలర్లలో శిఖా పాండే ఒక వికెట్ తీసింది. మరొకటి రనౌట్. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. సెంచరీ బాదిన బోల్టన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే గురువారం జరుగుతుంది.

Story first published: Tuesday, March 13, 2018, 8:23 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి