న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టుకు స్టెయిన్ దూరమేనా!

Gibson wary of rushing Steyn back into action

హైదరాబాద్: ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు బౌలింగ్ విభాగానికి వెన్నెముక ఫాస్ట్‌బౌల‌ర్ డేల్ స్టెయిన్‌. స్టెన్‌గ‌న్ నుంచి వెలువడే బుల్లెట్ల త‌ర‌హాలో బంతుల‌ను సంధించ‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌. స‌మ‌కాలీన క్రికెట‌ర్ల‌లో స్టెయిన్ ఒక్క‌డే నిఖార్స‌యిన ఫాస్ట్‌బౌల‌ర్‌. గాయం కార‌ణంగా దాదాపు ఏడాది కాలం పాటు జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు స్టెయిన్‌. భార‌త్‌తో జ‌రిగే మ్యాచ్‌ల‌కు స్టెయిన్ ఎంపిక‌య్యాడు.

అయితే భారత్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ ఆడకపోవచ్చని ఆ జట్టు కోచ్‌ ఓటిస్‌ గిబ్సన్‌ సూచనప్రాయంగా చెప్పాడు. స్టెయిన్ గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసేందుకు దాదాపు అన్ని ఏర్పట్లను అధికార వర్గం సిద్ధం చేసింది. మళ్లీ ఏమనుకుందో ఏమో వెంటనే బరిలోకి దించడం సాహసమే అవుతుందంటూ కోచ్ తో విషయాన్ని బయట పెట్టించింది.

నిజానికి.. మూడు నెల‌ల కింద‌టే స్టెయిన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న‌ప్ప‌టికీ.. అత‌ణ్ణి జ‌ట్టులోకి తీసుకోలేదు. భార‌త్‌తో ఆడ‌టానికి విశ్రాంతి ఇచ్చారు. తాజాగా ప్ర‌క‌టించిన తుది జ‌ట్టులో స్టెయిన్ చోటు సంపాదించాడు.

'అతడు ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్నాడు. స్టెయిన్‌ చివరిసారి 2016 నవంబరులో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ముగ్గురు సభ్యుల పేస్‌ విభాగంలో స్టెయిన్‌ను తీసుకుని, అతడు గాయంతో మ్యాచ్‌ మొత్తం ఆడలేకపోతే జట్టు పరిస్థితేంటి? నా ఉద్దేశం అతడు మ్యాచ్‌ను పూర్తి చేయలేడని కాదు. కానీ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో సాహసం చేయలేం' అని అన్నాడు.

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 5వ తేదీ నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం అవుతుంది. కేప్‌టౌన్‌ వేదికగా మొట్ట‌మొద‌టి టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేనతో తలపడే జట్టులో ఇప్పటికే డేల్ స్టెయిన్ ఉన్నాడని జట్టు పేర్లను ఖరారు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ జాబితాను మారుస్తారా లేదా స్టెయిన్‌ను కొనసాగిస్తారా అనేది సందిగ్ధం.

జట్టు: డుప్లెసిస్‌(సారథి), డికాక్‌(వికెట్‌ కీపర్‌), హషీమ్‌ ఆమ్లా, బవుమా, డివిలియర్స్‌, డి బ్రూన్‌, ఎల్గర్‌, కేశవ్‌ మహారాజ్‌, మర్ర్కమ్‌, మోర్కెల్‌, క్రిస్‌ మోరిస్‌, అండిలే పెహ్లుక్‌వాయో, ఫిలాండర్‌, రబాడ, డేల్‌ స్టెయిన్‌(సందిగ్ధం).

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 11:54 [IST]
Other articles published on Jan 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X